లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

బండి సంజయ్ మోసం చేసిండు.. రాజా సింగ్ ఆగ్రహం.. ఆడియో విడుదల

Published

on

భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటకు వచ్చాయి. ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై లేటెస్ట్‌గా ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల కిందట రాజా సింగ్ రాజీనామా వ్యవహారం ప్రకంపనలు రేపగా.. కార్యకర్తలు, తన అనుచరులతో మాట్లాడిన తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.అయితే గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో తనను పక్కన పెట్టడంపై తీవ్ర అసంతృప్తితో ఉండగా.. బండి సంజయ్ వైఖరి పార్టీ‌కి తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను బండి సంజయ్ అన్న మోసం చేశాడంటూ చెప్పుకొచ్చాడు. తనకు ఎప్పుడూ కూడా పార్టీ అధ్యక్షులతో గ్యాప్ ఉంటూ వస్తుంది. అయితే ఈసారి మాత్రం తన అనుచరులకు అసలు టిక్కెట్టే రాకుండా చేయడంపై రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బండి సంజయ్‌ను జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించిన అధ్యక్ష పదవి నుండి తొలగించమని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ట్వీట్ చేయగా.. అది వైరల్ అవుతుంది. కానీ అది అవాస్తవం అని రాజా సింగ్ తన అధికారిక ట్విట్టర్‌లో తెలిపారు. అయితే బండి సంజయ్ నన్ను మోసం చేసిన మాట వాస్తవం అంటూ తాను విడుదల చేసిన ఆడియోలో చెప్పుకొచ్చారు. నా నియోజకవర్గం వరకు నేను చెప్పిన వారికే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని అడిగాను. మిగిత 150డివిజన్‌లలో ఎక్కడ అడగను అని చెప్పాను. కానీ ఇక్కడ నాయకులు ఇస్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తానేనని, అది కార్యకర్తల కష్టం వల్లే సాధ్యం అయ్యిందని, అయితే తనను గెలిపించిన కార్యకర్తకు నేను టికెట్ ఇప్పించుకోలేక పోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నా ఫ్యామిలీలో ఒకరు సూసైడ్ చేసుకుంటే ఆ చావులో ఉన్నట్లు చెప్పిన రాజాసింగ్.. 3, 4 రోజుల్లో అన్ని విషయాలతో కేంద్రానికి లేఖ రాస్తానని ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *