లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

నేను దేవుడ్ని మీ సమస్యలు నాతో చెప్పుకోండి చిటెకెలో తీర్చేస్తానంటూ మహిళలపై బాబా లైంగిక వేధింపులు

Published

on

Rajasthan godman alleging sexual harassment in bundi : మేం దేవుడితో సమానమనీ..మాకు అతీంద్రీయ శక్తులున్నాయని మీ సమస్యలు మాతో చెప్పుకుంటూ మీ చింతలన్నీ తీర్చేస్తాం..మీ కష్టాలనీ తీర్చేస్తాం అంటూ బాబాలు చేసి మాయల్లో పడిపోతు ఆపై లబోదిబో మంటున్నారు బాధితులు. ముఖ్యంగా ఈ బాధితుల్లో మహిళే ఎక్కువగా ఉంటున్నారు. బాబాలం అనే పేరుతో మహిళలపై లైంగిక వేధింపులు..లైంగిక దాడులకు తెగబడే దొంగబాబాల గురించి ఎంతా వినిపిస్తున్నా మహిళలు వారి మాయలో పడుతునే ఉన్నారు.


అలా ఓ దొంగ బాబా ఆగ‌డాలు వెలుగుచూశాయి. తన దగ్గరకు వచ్చే మహిళలపై లైంగిక వేధింపుల‌కు పాల్పడుతున్న మరో దొంగబాబా గుట్టు బైటపడింది. ‘‘మీకేమన్నా సమస్యలుంటే నాతో చెప్పుకోండి..ఆ సమస్యల్ని చిటికెలో పోగొట్టి మీకు మానసిక ప్రశాంతత కలుగజేస్తానంటూ నమ్మబలికాడో ఓ దొంగబాబా. అతని మాయలోపడ్డ మహిళలు చాలామంది తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బైటకు చెప్పుకోలేదక..వాడి వికృత చేష్ట‌ల‌తోమానసికంగా కృంగిపోయారు. కానీ కొంతమంది మహిళలు తమలా ఇంకెవ్వరు ఆ దొంగబాబా మాయలో పడకూడదని ధైర్యం చేయటంతో సదరు మోసగాడి దారుణాలు బైటపడ్డాయి.


రాజ‌స్థాన్ రాష్ట్రం బుండి ప్రాంతంలో కొన్నాళ్ల క్రితం ఓ వ్య‌క్తి బాబా అవ‌తారం ఎత్తి ఓ ఆశ్ర‌మాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ‘‘నేను దేవుడిన‌ి..నా దైవ‌త్వం ఉంది..మీరు మీ సమస్యలు నాతో చెప్పుకుంటే ఆ దేవుడితో చెప్పుకున్నట్లేనంటూ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించాడు. అతని మాటలకు చాలామంది అతనికి భ‌క్తులుగా మారిపోయారు.


ఎలాంటి స‌మ‌స్య‌లైనా త‌న‌కు చెప్పుకుంటే ప‌రిష్కారం చూపిస్తానని ప్ర‌చారం చేసుకోవ‌డంతో.. ఎంతో మంది స‌మ‌స్య‌ల‌తో అత‌నికి ద‌గ్గ‌రికి చాలామంది మహిళలు వ‌చ్చేవారు. అలా నమ్మి వచ్చిన మహిళలపై వికృత చేష్టలకు దిగేవాడు. ఎక్కడెక్కో చేతులు వేసి తడిమేవాడు. నలిపేసేవాడు. దీంతో అతని బుద్ధి గ్రహించిన పలువురు మహిళలపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడు. కానీ ప‌రువు పోతుంద‌ని ఎవ్వరూ నోరు విప్పలేదు.


కానీ కొంతమంది మహిళలు ముందుకొచ్చి ఈరోజు అంటే బుధ‌వారం (అక్టోబర్28,2020) న‌లుగురు మ‌హిళ‌లు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో దొంగ బాబా బండారం బ‌య‌ట‌ప‌డింది. మ‌హిళ‌ల ఫిర్యాదు మేర‌కు పోలీసులు దొంగ‌ బాబాపై కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *