Rajasthan 55 years old wife 60 years drunkard husband killed in Pali District

తాగుబోతు భర్త హింసలు భరించలేక చంపి పొలంలో కప్పేట్టిన భార్య

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మద్యం తాగి తందనాలాడుతూ భర్త పెట్టే హింస భరించలేక ఓ భార్య కట్టుకున్నవాడిని కడతేర్చింది. తాగిందే కాకుండా నానా యాగీ చేస్తూ..ఇంటి చుట్టు పక్కల వారిని నానా దుర్భాషలాడుతూ..అడిగినవారిపై దాడి చేస్తూ నానా హింసలు పెడుతున్న అరాచకాలను..హింసలను…దశాబ్దాల తరబడి భరించీ భరించి చివరకు సహనం కోల్పోయి 55 సంవత్సరాల వయస్సులో 60 ఏళ్ల భర్తను కడతేర్చింది ఆ భార్య. ఇదేదో కథకాదు..సినిమా అంతకన్నా కాదు..రాజస్ధాన్ రాష్ట్రంలోని పాలి జిల్లాలో జరిగిన వాస్తవ ఘటన. 

పాలి జిల్లాలో నివాసముండే ఓ హమెర్‌సింగ్ ఉదేశ్  తాడుగుకు బానిసగా మారాడు. తాగంతే ఉండలేదు. నోట్లో చుక్క పడినా పడకపోయినా విచక్షణారాహిత్యంగా ప్రవర్తించటం అతనికి సర్వసాధారణంగా మారిపోయింది. చుట్టు పక్కలవారితో పాటు బంధువులు కూడా ఆమెను నానా రకాలుగా నిందించేవారు.

భర్తను అదుపులో పెట్టుకోలేక మాపై ఇలా పడేస్తున్నావంటూ హమెర్‌సింగ్ ఉదేశ్ భార్య కమలా కన్వర్ ను నిందించవేారు. తాగి తాగి అతని ఆరోగ్యం పాడైపోతుందనే ధ్యాస కూడా నీకు లేదంటూ ఇష్టమొచ్చినట్లుగా మాట్లేడేవారు. చుట్టు పక్కల వారికీ..బంధువులకు మనమంటే గౌరవం లేకుండాపోతోంది. పరువుపోతోంది..తాగినా వచ్చి ఇంట్లో ప్రశాంతంగా ఉండమని కమలా కన్వర్ ఎన్నో రకాలుగా చెప్పీ చెప్పీ విసిగిపోయంది. బతిమాలుకుంది.  కానీ అతడి పరిస్థితి మారలేదు. 

దీంతో భర్తపై విసిగిపోయిన ఆమె సహనం కోల్పోయింది. రెండు వారాల క్రితం ఆమె అతన్ని చంపేసింది. మృతదేహాన్ని ఒక సంచిలో ప్యాక్ చేసి..వ్యవసాయ భూముల్లోకి ఆ సంచినీ పట్టుకెళ్లి..అక్కడే పాతిపెట్టేసింది. ఆ తరువాత కొన్ని రోజులకు లాక్డౌన్ 4.0 ముగిసింన అనంతరం ఆమె తన కూతురుని ఇంటికి రమ్మని పిలిచింది. అలా వచ్చిన కూతురితో మీ నాన్న కనిపించట్లేదని ఎక్కడో తప్పిపోయాడని చెప్పింది. 

కానీ కూతురు నమ్మలేదు. నిజం చెప్పమని ఒత్తిడి చేసేసరికి అసలు విషయం చెప్పింది ఆ తల్లి. హత్య చేశానని ఒప్పుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. పోలీసు అధికారులు  బ్రజేష్ సోని, సిఐ బాలి హిమాన్షు జంగిద్, గిర్ధర్ సింగ్ మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అందజేశారు. మద్యం తాగి భర్త పెట్టే హింసలు..బంధువులు..ఇరుగుపొరుగువారి నిందలు భరించలేదక  ఆమె భర్త హత్య చేసిందనీ దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

 

Read: చెల్లెలిపై అత్యాచారం చేసిన భర్తను చంపి ఇంటి వెనుక పాతి పెట్టేసిన భార్య

Related Posts