లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఆస్పత్రిలో దారుణం : 24 గంటల్లో 9మంది పసికందులు మృతి

Published

on

Rajasthan : 9 newborns die in Kota’s JK Lon Hospital : రాజస్థాన్ కోటాలోని జేకే లోన్ ఆస్ప‌త్రిలో దారుణం చోటుచేసుకుంది. 24 గంట‌ల వ్య‌వ‌ధిలో తొమ్మిదిమంది మంది ప‌సికందులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం (డిసెంబర్ 9,2020) నుంచి గురువారం మధ్యాహ్నాం మధ్యలో తొమ్మిదిమంది నవజాత శిశులు ప్రాణాలు కోల్పోయారు. డాక్టర్లు, ఆస్ప‌త్రి యాజ‌మాన్యం నిర్ల‌క్ష్యం వ‌ల్లే తమ బిడ్డలు చనిపోయారని భోరున విలపిస్తూ..బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నారు.ఇవి కేవలం ఆరోపణలు మాత్రమేనని..మా నిర్లక్ష్యం ఏమీ లేదని జేకే లోన్ ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ డాక్టర్ దులారా తెలిపారు. ప‌సికందుల మృతి విష‌యంలో త‌మ తప్పులేదనీ తాము ఎటువంటి నిర్లక్ష్యం చేయలేదని అన్నారు. తొమ్మిదిమంది పసిబిడ్డల మరణాల్లో ముగ్గురిని చ‌నిపోయిన త‌ర్వాత‌నే తమ ఆస్ప‌త్రికి తీసుకొచ్చార‌ని..మ‌రో ముగ్గురు పుట్టుక సంబంధ రుగ్మ‌త‌ల‌తో మృతిచెందార‌ని..ఇంకో ఇద్ద‌రు వేరే ఆస్ప‌త్రుల నుంచి రిఫ‌ర్ చేస్తే ఇక్క‌డికి వ‌చ్చార‌ని తెలిపారు.ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండటంతో రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుంది. ఆరోగ్య మంత్రి శర్మ శిశువుల విచారణకు గల కారణాలపై విచారణకు ఆదేశించారు. విచారణ కోసం ఆరోగ్యశాఖ ఒక క‌మిటీని ఏర్పాటు చేసింది. న‌లుగురు స‌భ్యుల‌తో కూడిన ఈ క‌మిటీని మూడు ప‌నిదినాల్లో ద‌ర్యాప్తు పూర్తిచేసి నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఆరోగ్య‌శాఖ ఆదేశించింది.కాగా ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు కూడా లేవనీ..సరైన నిర్వాహణ లేదనీ సిబ్బంది నిర్లక్ష్యంతో ఇంత దారుణం జరిగిందని బాధి కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.పిల్లల మరణాల విషయం మీడియాలో హైలైట్ అయ్యింది.దీంతో ఆస్పత్రి పీడియాట్రిక్స్ డిపార్ట్ మెంట్ నివేదికలో ఆస్పత్రిలో 513 పరికరాలలో 320 పరికరాలు పనిచేయడం లేదని తెలిపింది.భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరుగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకంటుందని మంత్రి హామీ ఇచ్చారు.