చంబల్ నదిలో​ పడవ బోల్తా…12 మంది మృతి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాజస్థాన్​లోని కోటాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇటావా వద్ద చంబల్​ నదిలో దాదాపు 45 మందితో వెళ్తోన్న పడవ నీటమునిగింది. బూందీ జిల్లాలోని కమలేశ్వర్‌ మహాదేవ్​ ఆలయానికి సుమారు 45 మందితో వెళ్తున్న పడవ అదుపుతప్పి బోల్తాపడింది. ప్రయాణికుల్లో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు.

ప్ర‌మాదంపై అధికారుల‌కు స‌మాచార‌మిచ్చిన స్థానికులు వెంట‌నే అప్ర‌మ‌త్తమ‌య్యారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు నదిలో దూకి కొంతమందిని రక్షించారు. 14 మంది గ‌ల్లంత‌య్యారు.


సంగీత ఝరి..స్వరామృత ధార.. ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి..


ఘ‌టనాస్థ‌లికి చేరుకున్న రెస్క్యూ బృందాలు ఇప్ప‌టి 12 మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు తీశాయి. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు వెల్ల‌డించాయి. ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

అయితే ప‌డ‌వ‌లో కొంద‌రు బైక్‌ల‌ను కూడా తీసికెళ్లిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు. ప‌డ‌వ‌లో ప‌రిమితికి మించి ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఈ కార‌ణంగానే ప‌డ‌వ అదుపుత‌ప్పి నీటిలో ప‌డిపోయి ఉంటుంద‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.


ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు రాజ‌స్తాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గ‌హ్లోత్ సంతాపం వ్య‌క్తం చేశారు. ఇది చాలా దుర‌దృష్ట‌క‌ర‌మైన ఘట‌న అని, ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నామ‌న్నారు. బాధిత కుటుంబాల‌కు బాధిత కుటుంబాల‌కు రూ. 1 లక్ష ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

Related Posts