లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఆ ఊళ్లో పురుషులకు ఇద్దరు భార్యలు..! పిల్లలు పుట్టే విషయంలోనూ ఎక్కడా వినని వింత !!

Published

on

Rajasthan village strange Custom : సాధారణంగా మొదటి భార్య జీవించి ఉండగా పురుషుడు మరో వివాహం చేసుకుంటే చట్టరీత్యా నేరం. కానీ రాజస్థాన్ లోని ఓ గ్రామంలో మాత్రం అది ఆచారం. ఆ గ్రామంలో ప్రతీ పురుషుడికీ ఇద్దరు భార్యలు ఉండాల్సిందే. అది అక్కడి ఆచారం. ఇది ఆచారమే కాదు అవసరం కూడా అంటున్నారా గ్రామ ప్రజలు. ఆవింత గ్రామం పేరు ‘దెరాసర్’. మరి ఆ వింత గ్రామం గురించి తెలుసుకుందామా..

ఆహా..ఏమీ ఈ దెరాసర్ గ్రామ పురుషుల అదృష్టం..ఒక్క భార్య దొరకడమే గగనంగా మారుతున్న ఈరోజుల్లో ఇద్దరు భార్యలంటే ఆ ఊరి మగాళ్లు అదృష్టవంతులురా బాబూ అని అనుకుంటున్నారు కదూ..అది ఆ ఊరి ఆచారమే కాదు అవసరం కూడా..!!

రాజస్థాన్ లోని బార్మర్ జిల్లా దెరాసర్ అనే గ్రామం అది. ఆ గ్రామం జనాభా కేవలం 600 మాత్రమే. కానీ.. ఆ గ్రామంలో ప్రతీ పురుషుడికి ఇద్దరు భార్యలను చేసుకోవాల్సిందే. అంటే ఆ గ్రామంలో పురుషుల కంటే స్త్రీల జనాభాయే ఎక్కువగా ఉంటుందనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ ఇద్దరు భార్యల ఆచారం ఈనాటిది కాదట. కొన్ని వందల ఏళ్లగా వస్తోందట. ఆ ఆచారాన్ని ఆ ఊరి గ్రామస్తులు పాటించాల్సిందే. ఎందుకు పాటించాలి అంటే పిల్లల కోసమండీ బాబూ పిల్లల కోసం అంటారు అక్కడి పురుషులు..

ఆ ఊరికి చెందిన పురుషుడు ఒక పెళ్లి చేసుకుంటాడు. కానీ..ఆమెకు పిల్లలు పుట్టరు. దీంతో రెండో పెళ్లి చేసుకుంటాడు. అంటే అతనిలో లోపం ఉందేమో అందుకే పుట్టలేదేమో..దానికే రెండో పెళ్లి చేసుకుంటాడా? అనే డౌట్ రావచ్చు..అసలు విషయం అక్కడే ఉందిమరి..!! మొదటి భార్యతో పిల్లలు పుట్టటం కోసం అతను ఎంతకాలం అయినా రెండో పెళ్లి చేసుకుండా ఉండినా ఆమెకు పిల్లలు పుట్టనే పుట్టరట..!! అతను రెండో పెళ్లి చేసుకున్నాక..రెండో భార్యకు పిల్లలు పుట్టాకే మొదటి భార్యకు పిల్లలు పుడతారట..!!

అది ఎప్పటినుంచో జరుగుతోందట..ఇది ఏ ఒక్కరికో కాదు మొత్తం గ్రామంలో అందరి పురుషుల విషయంలో జరుగుతోంది. అందుకే ఆ దెరాసర్ గ్రామంలో పురుషులు తప్పనిసరిగా రెండు పెళ్లిళ్లు చేసుకుంటారు. రెండో పెళ్లి చేసుకున్న మహిళకు పిల్లలు పుట్టిన తర్వాత మొదటి భార్యకు కూడా పుడతారట.

మొదటి భార్యను చేసుకొని ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా..సరే ఆమెకు పిల్లలు మాత్రం పుట్టరట. రెండో పెళ్లి చేసుకుంటేనే మొదటి భార్యకు కూడా పిల్లలు పుడతారట. ఆ ఊరి ప్రజలకు మాత్రమే అలా అవుతుందట…! అందుకే.. మొదటి భార్యే దగ్గరుండి తన భర్తకు దగ్గరుండి రెండో పెళ్లి జరిపిస్తుంది. భలే ఉంది కదా వీళ్ల ఆచారం.

తెలిసింది కదా.. దెరాసర్ గ్రామంలో పురుషులకు ఇద్దరు భార్యలు అనేది ఆచారమే కాదు అవసరం కూడానని. ఆ గ్రామ పురుషులకు పిల్లలు పుట్టాలంటే రెండో పెళ్లి చేసుకోవాల్సిందే..ఆమె పిల్లలు పుట్టాకనే మొదటి భార్యకు పిల్లలు పుడతారట..అందుకోసమే ఆ గ్రామంలో తప్పనిసరిగా మగవాళ్లకు ఇద్దరు భార్యలు ఉండాల్సిందేనన్నమాట..

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *