అక్కడ ఆవు పాల కంటే ఆవు మూత్రానికే ఎక్కువ రేటు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Rajasthan : రాష్ట్రంలో పాడి రైతులకు చక్కటి ఆదాయం పొందుతున్నారు. అక్కడి రైతులు ఆవుల్ని పెంచుతున్నారు. వాటి పాలతో పాటు గోమూత్రాన్ని కూడా అమ్ముకుంటూ చక్కటి ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ఆవుపాలకంటే ఆవు మూత్రానికే ఎక్కువ ధర రావటంతో పాలకంటే మూత్రం మీదనే రైతులు ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు.


ఇంత కాలం రాజస్ధాన్ రైతులు ఆవు పాలతో పాటు..ఆవు పేడతో పిడకలు చేసేవారు. వాటిని వంట చెరకుగానూ..పొలంలో ఎరువులుగానూ వాడేవారు. ఇప్పుడు వాటితో పాటు గోమూత్రానికి కూడా మంచి డిమాండ్ ఉండటంతో వారిపంట పండుతోంది.


ప్రస్తుతం గోమూత్రాన్ని రైతులు సేంద్రీయ వ్యవసాయంతో పాటు ఆధ్యాత్మిక పరమైన ఆచారాలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. గోమూత్రంతో పలు రకాల ఉత్పత్తులు తయారుచేయటంతో గో మూత్రం టోకు మార్కెట్లో లీటరుకు రూ .30 వరకు అమ్ముతున్నారు.


ఒక లీటరు ఆవు పాల ధర రూ .22 నుంచి 25 ఉంటే ఆవు మూత్రం మాత్రం లీటరు రూ.30 నుంచి 50 పలుకుతోంది. దీంతో గోమూత్రం అమ్మకాల ద్వారా రైతుల ఆదాయంలో 30 శాతం పెరుగుదల ఉందని ఓ నివేదిక కూడా వెలువడింది. ఈ నివేదిక ప్రకారంగా చూస్తే ఆవు మూత్రాన్ని అమ్మడం ప్రారంభించిన నాటి నుంచి రైతుల ఆదాయం 30% పెరిగింది. గోమూత్ర ఉత్పత్తికి అధిక డిమాండ్ కాగా..మామూలు ఆవుల కంటే గిర్, తార్‌పార్కర్ ఆవుల మూత్రానికి ఇంకా మంచి డిమాండ్ ఉంది.


అంతేకాదు హిందూ సంప్రదాయం ప్రకారం.. పూజా కార్యక్రమాలతో పాటు గో మూత్రాన్ని పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా ఆవు మూత్రాన్ని సేంద్రీయ వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారు. ఔషధ ప్రయోజనాల కోసం మరియు ‘జనన’ వేడుకలో ‘యజ్ఞం’ వంటి మతపరమైన ఆచారాలకు కూడా గోమూత్రాన్ని ఉపయోగిస్తారు. కాగా..గోమూత్రం సేకరించడానికి రైతులు రాత్రిపూట మెలకువగా ఉండాలి. ఎందుకంటే గోవు మూత్రం బకెట్ల వంటివాటితో ఆవులు మూత్రం పోసేటప్పుడే దాన్ని పట్టి భద్రపరచాలి. మూత్రం నేల మీద పడకుండా బకెట్ ద్వారా సేకరించాలి.ఉదయపూర్ లోని మహారాణా ప్రతాప్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ యూనివర్శిటీ ఆవు మూత్రాన్ని ఎక్కువగా కొనుగోలు చేసే వాటిలో ఒకటిగా ఉంది. యూనివర్శిటీ వ్యవసాయం కోసం నెలకు 300–500 లీటర్ల మూత్రాన్ని కొనుగోలు చేస్తోంది వర్శిటీ. ఇందులో వర్శిటీ రూ .15 వేల నుంచి రూ .20,000 వరకు ఖర్చు వినియోగిస్తోంది.

Related Tags :

Related Posts :