Home » అత్తింట్లో వేధింపులు..నిప్పంటించుకున్న భార్య..రక్షించకుండా వీడియోతీసిన భర్త
Published
2 months agoon
By
nagamaniRajasthan : కట్టుకున్న భార్య కళ్లముందే మంటల్లో కాలిపోతుంటే కాపాడ్డం పోయి..చక్కగా స్మార్ట్ ఫోన్ తో వీడియో తీసాడు భర్త. ఎంతవారిద్దరి మధ్యా విభేదాలున్నా సాటి మనిషి అందునా కట్టుకున్న భార్య మంటల్లో కాలిపోతుంటే అడ్డుకోవాల్సిన భర్త దాన్ని వీడియో తీసాడు..హా చావవే అంటూ ఎంజాయ్ చేస్తూ వీడియో తీస్తూ పైశాచినానందం పొందాడు.రాక్షసానందం పొందాడు. అమానవీయమైన ఈ ఘటన రాజస్తాన్ లోని ఝలావర్ జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే..సికార్ నగరంలో మనీషా కుమారి, అనిల్ కుమార్ లకు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే అత్తింటి వేధింపులు భరించలేక మనీషా నవంబర 20న ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న భర్త భార్యను అడ్డుకోవాల్సింది పోయి తన ఫోన్ లో వీడియో తీస్తూ రాక్షసానందం పొందాడు. ‘‘చావవే చావు నీ పీడ నాకు ఈరోజుతో పోతుంది’’అంటూ వీడియో తీస్తూ పైశాచికానందం పొందాడు.
అలా భర్త కళ్లముందే పూర్తిగా కాలిన గాయాలతో ఉన్న ఆమె జైపూర్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత ఆదావారం (నవంబర్ 22,2020) మరణించింది. ఆమె ఆత్మహత్య చేసుకునే సయమంలో ఆమె భర్తతో పాటు కుటుంబ సభ్యులంతా అక్కడే ఉన్నారు.కానీ ఏ ఒక్కరు అడ్డుకోలేదు.దీంతో ఆమె మంటల్లో కాలిపోయింది. తరువా హాస్పిటల్ లో మరణించింది.
భార్య కాలిపోతుంటే వీడియో తీసిన ఆ భర్త ఆ వీడియోను పలువురికి షేర్ చేశాడు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై మనీషా సోదరుడు ఆ వీడియోను పోలీసులకు చూపించి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం( నవంబర్ 24)న ఈ మనీషా అనిల్ కుమార్, అతని తల్లిదండ్రులతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
కాగా మనీషాకు 2012లో పెళ్లి అయింది. 2019లో భర్త, ఇతర కుటుంబ సభ్యులపై ఆమె గృహ హింసకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెకు అత్తింటివారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. ఆ తరువాత కూడా మనీషాపై అత్తింటివారు వేధింపులు మానలేదు.
ఈ క్రమంలో ఇటీవల భర్త తరచూ దారుణంగా కొట్టటం..పరుష పదాలతో తీవ్రంగా దూషించటంతో మానసికంగా..శారీరకంగా వారి వేధింపులు భరించలేని మనీషా ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నట్టు పోలీసులు చెప్పారు.fire in laws make video