లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Life Style

రాజసాల నజరానా : ఏనుగుల ఊరు ‘హాథీగావ్‌’ ప్రత్యేకతలు

Published

on

: Jaipur Elephant Village Haathigaon : ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కొమ్ముులు (దంతాలు) తెల్లన అని పాడుకునే చిన్నారుల నుండి పెద్ద వారి వరకూ ఏనుగు సవారీ అంటే ఇష్టపడనివారుండరు. పర్యాటక ప్రదేశాల్లో ఏనుగులు కనిపిస్తే ఎక్కి ఎంతో సంబర పడిపోతాం. చిన్నపిల్లల్లా మురిసిపోతాం. అలా ఓ గ్రామస్థులు ఆ ఏనుగుల మీదనే ఆధారపడి జీవిస్తుంటారు. ఆఊరంతా ఏనుగులే. ఆ ఊరిపేరు ‘‘హాథీ గావ్’’. ఏనుగుల ఊరు.ఆ ఊరికి వెళ్తే ఎక్కడ చూసినా ఏనుగులే కనిపిస్తాయి. ఒకటి కాదు రెండు కాదు… అందుకే ‘హాథీగావ్‌’ని ఏనుగుల ఊరు అంటారు..!రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌. జైపూర్ అంటే రాజులు ఏలిన స్థలం. రాజప్రాసాదాలకు పెట్టింది పేరు. ఎన్నో కోటలు, అద్భుత కట్టడాలకు ప్రసిద్ధి జైపూర్. దీంతో ప్రముఖ పర్యాటక ప్రాంతం మంచి పేరు పొందింది. ఎతైన కోటల్ని చూసేందుకు పర్యాటకులు ఏనుగులపై కూర్చుని వెళ్లి చూసొస్తుంటారు. జైపూర్‌కు సరిగ్గా 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ‘హాథీగావ్‌’ గ్రామం. హీథీగావ్ అంటే ఏనుగుల ఊరు అని అర్థం.
ఏనుగులకు ప్రత్యేక ఇళ్లు..
ఆ ఊరిలో మనుషులకే కాదు ఏనుగులకు కూడా ప్రత్యేకంగా ఇళ్లు ఉంటాయి. ఏనుగులనే జీవనాథారంగా జీవించే హాథీగావ్ గ్రామస్తులు ఏనుగుల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటారు. అలా ఆ ఊరిలో 102 ఏనుగులకు ప్రత్యేకంగా ఇళ్లున్నాయి. ఏనుగులను జీవనాధారంగా చేసుకుని అక్కడ 130కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి.ఏనుగులకు వాటి యజమానులు పేర్లు కూడా పెట్టుకున్నారు. ఆ పేర్లతోనే వాటిని పిలిస్తే తొండాలు ఊపుకుంటూ వచ్చేస్తాయి. ప్రతీరోజూ ఏనుగులకు స్నానం చేయించి, చెరకు, అరటి గెలలు తినిపించి సవారీకి సిద్ధం చేస్తారు. ఏనుగులు స్నానం చేయడానికి ప్రత్యేకంగా ఒక కొలను కూడా ఏర్పాటు చేశారు గ్రామస్థులు.


ఏనుగుల ఊరు హాథీగావ్ చరిత్ర
రాజస్థాన్‌లో రజ్వాడా సైన్యం ఉన్న సమయంలో హాథీగావ్ లో 1000య్యి ఏనుగులు వరకూ ఉండేవట. గజబలం కోసం ఈ ఏనుగులను వినియోగించేవారు. వాటిని సైనికులు తమ ఇళ్లలో ఉంచుకునేవారు కాబట్టి ఈ ప్రాంతానికి ‘హాథీగావ్‌’ అనే పేరొచ్చింది. రాజ్యాలు అంతరించిన తర్వాత జైపూర్‌ ప్రాంతంలో కోటలు, ప్రసిద్ధ కట్టడాలు పర్యాటక కేంద్రాలుగా నేటికి ప్రసిద్ది పొందాయి. పర్యాటకంగా రాజస్థాన్ కు మంచి ఆదాయం కూడా వస్తుంది.


రాజుల కాలం పోయింది.రాజ్యాలు కూలిపోయాయి. అలా అలా కాలక్రమేణా హాథీగావ్ మాత్రం ఏనుగుల ఊరిగా పేరొందింది.అలా ఏనుగుల సవారీతో గ్రామస్తుల్లో చాలామంది జీవిస్తున్నారు. జైపూర్‌ పరిసరాల్లో ఉన్న కోటలను..ఇతర కట్టడాలను చూసేందుకు వాటిని ఎక్కేందుకు ఈ గ్రామం నుంచే ఏనుగులను తీసుకెళ్తుంటారు.

హాథీగావ్ కు వెళ్లాలంటే పాటించాల్సిన నిబంధనలు
‘హాథీగావ్‌’లోకి పర్యాటకులు వెళ్లాలంటే ఒక్కొక్కరికి రూ.100 చెల్లించాలి. సుమారు 100 ఎకరాల్లో ఉన్న ఈ గ్రామంలోకి వెళ్లాక ఎవ్వరైనా సరే తప్పనిసరిగా శుభ్రత పాటించాల్సిందే. ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేయకూడదు..తినుబండారాలు, వ్యర్థ పదార్థాలు పడేయకూడదు. పద్దతి ప్రకారం చెత్తబుట్టల్లోవేయాల్సిందే. లేకుంటే జరిమాల రూపంలో జేబులు ఖాళీ అవుతాయి.


ఏనుగు సవారీకి రూ.500 నుంచి 1500
‘హాథీగావ్‌’లో ఏనుగులపై సవారీ చేయటానికి రూ. 500 నుంచి 1500 వరకూ తీసుకుంటారు. అలా హాథీగావ్ ను సందర్శించేందుకు ప్రతీరోజూ 300 మందికిపైగా పర్యాటకు వస్తుంటారని..సెలవు రోజుల్లో అయితే 500 దాకా ఉంటుందని స్థానికులు తెలిపారు.


హాథీగావ్ గ్రామంలోకి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటలదాకా మాత్రమే పర్యటించటానికి అనుమతి ఉంటుంది. జైపూర్‌కు వెళ్తే తప్పకుండా ఈ గ్రామాన్ని చూడాల్సిందే. ఎందుకంటే ఒకేచోట 100కు పైగా ఏనుగులను చూసే అవకాశం మరెక్కడా ఉండదు కాబట్టి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *