లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

క్రేజీ ఫోటో : పెళ్లి శుభలేఖపై ‘ఐ లవ్ కేజ్రీవాల్’

Published

on

rajasthan jaipur kejriwal craze reached outside delhi i love kejriwal written on wedding card

మూడవ సారి అధికారంలోకి వచ్చి..ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలో ఆప్ హవాతో బీజేపీ ఓడిపోయింది. కేజ్రీవాల్ పని తీరును మెచ్చి ఢిల్లీ ప్రజలు ఆయనకు మరోమారు పట్టం కట్టారు. కేజ్రీవాల్‌కు ఢిల్లీలోనే కాదు దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ లోగల సూర్యనగరికి  చెందిన ఒక వ్యక్తి తన కొడుకు వివాహం సందర్భగా పెళ్లి కార్డులపై ‘ఐ లవ్ కేజ్రీవాల్’ అని ప్రింట్ చేయించారు. ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 

జోథ్ పూర్ లోని బాలేసర్ లోని కేతు రామ్ నగర్ లో నివసిస్తున్న దుర్గారాం కంబుకు నీలేష్ అనే కొడుకు ఉన్నాడు. అతనికి ఫిబ్రవరి 21న లక్షిత అనే యువతితో వివాహం జరగనుంది. కేజ్రీవాల్  అంటే ఎంతో అభిమానం ఉన్న దుర్గారాం కంబు తన కొడుకు వెడ్డింగ్ కార్డ్ లో ‘ఐ లవ్ కేజ్రీవాల్’ అని ప్రింట్ చేయించి తన అభిమానాన్ని చాటుకున్నారు.

దీనిపై రాజస్ధాన్ ఆప్ ప్రతినిధి జబ్బర్ సింగ్ మాట్లాడుతూ..రాజస్థాన్ ప్రజలు చాలా తెలివైనవారు వెడ్డింగ్ కార్డు ద్వారా రాజస్థాన్ కు శుభసంకేతాలిస్తూ..ఆప్ కు స్వాగతం పలుకుతున్నారనీ అన్నారు. త్వరలోనే ఆప్ రాజస్థాన్ లో కూడా పోటీ చేసి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ వెడ్డింగ్ కార్డు చూసి రాజస్థాన్ లో ఆప్ పార్టీ వారంతా పెళ్లికి రావాలని సూచించారు. రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఇంటితో పాటు కేంద్రమంత్రి గజేంద్రసిన్ షెఖావత్ నియోజవర్గం అయిన జోధ్‌పూర్ లోగల సూర్యనగరి బాలేసర్ లో ఈ వెడ్డింగ్ కార్డ్ విశేషంగా మారింది. 

Read More>>2 వేల ఐ ఫోన్లు ఉచితంగా పంపిణీ

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *