లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime Stories

భార్యను హత్య చేసి శవం పక్కనే కూర్చుని కూల్ గా వీడియో గేమ్ ఆడుతూ..

Published

on

Rajasthan Jodhpur husband kills wife plays mobile games : కట్టుకున్న భార్యను కత్తెరతో పొడిచి చంపి తాపీగా ఆమె మృతదేహం పక్కనే కూర్చుని వీడియో గేమ్ ఆడుకుంటున్న భర్త ఉదంతం వెలుగులోకి వచ్చింది. భార్యను చంపటమే కాకుండా ఏమాత్రం పశ్చాత్తాపం గానీ, కంగారు గానీ, భయంగానీ లేకుండా వీడియో గేమ్ ఆడుకుంటు కూర్చున్నాడు అంటే అతను ఎంత దారుణమైనవాడో అర్థం చేసుకోవచ్చు. రాజస్థాన్ లో జరిగిన ఈ ఘటనలో పక్కాగా ప్లాన్ చేసిన చంపినట్లుగా తెలుస్తోంది. అతి దారుణంగా హత్య చేశాడు.వివరాల్లోకి వెళితే..రాజస్థాన్ రాష్ట్రం జోధ్ పూర్ లోని బీజేఎస్ కాలనీకి చెందిన విక్రమ్ సింగ్ అనే 35 ఏళ్ల యువకుడు కొన్నేళ్ల క్రితం శివ కన్వార్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈక్రమంలో గత కొంతకాలం నుంచి విక్రమ్ ఎలాంటి ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. దీంతో ఇల్లు గడవటానికి ఆమె మిషన్ కుట్టేది. ఈక్రమంలో విక్రమ్ భార్యతో తరచూ గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో ఆదివారం (డిసెంబర్ 6,2020) భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవకాస్తా పెద్దదైంది. దీంతో భార్యపై విపరీతమైన ఆగ్రహంతో ఊగిపోయిన విక్రమ్ కత్తెర తీసుకుని ఆమెను పొడిచేశాడు.ఏదో ఆగ్రహంలో ఇలా చేసానని విక్రమ్ ఏమాత్రం అనుకోలేదు. రక్తపు మడుగులో పడి చనిపోయిన భార్యను పట్టించుకోలేదు.ఆమె గిలగిలా కొట్టుకుంటుంటే ఏమాత్రం చలించలేదు. అలా ఆమె తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయింది. తరువాత చాలా కూల్ గా అత్తమామలకు ఫోన్ చేసి మీ కూతుర్ని చంపేశాను అని చెప్పాడు. ఆ మాటలు విన్నవారికి మొదట ఏమీ అర్థం కాలేదు. అదే విషయాన్ని అల్లుడు మరోసారి చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఇది నిజమా కాదానే సందిగ్ధంలో పడిపోయారు శివ కన్వర్ తల్లిదండ్రులు. కానీ మనస్సుని కీడును శంకించటంతో గబగబా కూతురు ఇంటికి వచ్చి చూడగా రక్తపు మడుగులో పడిఉన్న కూతుర్ని చూసి భోరుమని విలపించారా తల్లిదండ్రులు అనంతరం అల్లుడిమీద ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ విక్రమ్ సింగ్ ఏమాత్రం చలించలేదు.తిరిగి వీడియో గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాడు.దీంతో శవ కన్వర్ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు వచ్చే సమయానికి కూడా విక్రమ్ సింగ్ ఫోన్ లో వీడియో గేమ్ ఆడుతూనే కూర్చున్నాడు. అది చూసిన పోలీసులు పోలీసులు విక్రమ్ సింగ్ కు ఏమన్నా మానసిక సమస్యలు ఉన్నాయేనని అనుమానించారు. వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు. శివ కన్వర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు.


దీనిపై డీసీపీ ధర్మేంద్ర సింగ్ యాదవ్ మాట్లాడుతూ..ఏపని చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉండే విక్రమ్ అసంతృప్తిగా ఉండేవాడనీ..అందుకే భార్యతో తరచూ గొడవపడి ఆ గొడవలో హత్య చేశాడని తెలిపారు. ఈ హత్యపై సమాచారం అంది వెళ్లేసరికి భార్య శవం పక్కనే కూర్చుని విక్రమ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ కనిపించాడని తెలిపారు. అలాగే విక్రమ్ తండ్రి మనోహర్ సింగ్ ను కూడా అదుపులోకి తీసుకున్నామనీ కేసు విచారణ కొనసాగుతోందని తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *