Home » మాస్క్‌లు తప్పనిసరి చేసిన తొలి రాష్ట్రం రాజస్థాన్
Published
3 months agoon
By
subhnRajasthan: రాజస్థాన్ అసెంబ్లీ సోమవారం పబ్లిక్‌లో మాస్క్‌లు తప్పనిసరి అంటూ బిల్ పాస్ చేసింది. ప్రైవేట్ లేదా పబ్లిక్ గా, సోషల్ లేదా పొలిటికల్ ఈవెంట్స్ కు అటెండ్ అవుతున్న సమయంలో మాస్క్ లు కచ్చితంగా ధరించాలి. కొవిడ్ కు వ్యతిరేకంగా తీసుకున్న కొత్త చర్యట్లో భాగంగా.. రాజస్థాన్ మహమ్మారి చట్టం ప్రకారం అసెంబ్లీ నయా చట్టం తీసుకురానుంది.
యాంటీ కొవిడ్ వ్యాక్సిన్ రాకముందు వరకూ ఫేస్ మాస్క్‌లు వాడటమే కరెక్ట్ అని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్ చెప్పారు. ఈ మేరకు వాయీస్ ఓట్ ల సహకారంతో రాజస్థాన్ మహమ్మారి (అమెండ్మెంట్) బిల్ ను హౌజ్ పాస్ చేసింది. పబ్లిక్‌లో కదలికల సమయంలో నోరు, ముక్కు ఫేస్ మాస్క్‌తో కవర్ చేయకుండా తిరగడం నిషిద్ధం.
‘ముఖానికి మాస్క్ ధరించి ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని.. మిలియన్ల కొద్దీ వ్యక్తుల ప్రాణాలు కాపాడొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు’ అని ఆ బిల్లులో పేర్కొన్నారు.
బిల్‌పై హౌజ్‌లో జరిగిన చర్చలో పార్లమెంటరీ అఫైర్స్ మినిష్టర్ శాంతి ధరివాల్.. జనరల్ పబ్లిక్ సపోర్ట్‌తో మాత్రమే కరోనావైరస్ ఇన్ఫెక్షన్ నుంచి పోరాడగలం అని అన్నారు. బిల్ అప్రూవ్ చేసే ప్రక్రియలో హౌజ్ అమెండ్మెంట్ ప్రపోజల్ ను రిజెక్ట్ చేసి పబ్లిక్ ఒపినీయన్ తీసుకోవాలనుకున్నారు.
ఈమేరకు రాజస్థాన్ సీఎం మాట్లాడుతూ.. ‘కరోనాకు వ్యతిరేకంగా పోరాడేందుకు పబ్లిక్ లో మాస్క్ లు తప్పనిసరి చేసిన రాష్ట్రాల్లో రాజస్థాన్ తొలి రాష్ట్రం. కరోనాకు వ్యతిరేకంగా పోరాడే వ్యాక్సిన్ లాగే మాస్క్ లు పనిచేస్తాయి’ అని అన్నారు.