లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

పెళ్లికి వచ్చిన యువతిని అడవిలో బంధించి 14 రోజుల పాటు అత్యాచారం

Published

on

Rajasthan : ఎంత అప్రమత్తంగా ఉన్నా గానీ దేశంలో ఎంతోమంది యువతులపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అటువంటిది అమాయకంగా ఉంటే ఇక జరిగే అనర్థం గురించి చెప్పనక్కర్లేదు. అటువంటి ఓ ఘటన రాజస్థాన్ లో జరిగింది. అందమైన ప్రదేశాలను చూడాలని అనుకున్న ఓ అమ్మాయిని అంతకంటే అందమైన మాటలతో నమ్మించి అడవిలోకి తీసుకెళ్లి బంధించి 14 రోజుల పాటు అత్యాచారాలు చేస్తూ దారుణ హింసలు పెట్టాడో కామాంధుడు. ఎట్టకేలకు ఆ కామాంధుడి చెర నుంచి తప్పించుకున్న ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.అందమైన ప్రదేశాలు అంటే ఇష్టమై చూస్తూ ఎంజాయ్ చేసే ఓ అమ్మాయిని రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు 20 ఏళ్ల వయస్సు ఉన్న ఓ యువతిని కిడ్నాప్ చేసి అడివిలో బంధించి 14 రోజుల పాటు దారుణంగా రేప్ చేశాడు. ఎట్టకేలకు ఆ కామాంధుడి చెర నుంచి తప్పించుకున్న ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. నిందితుడు పరారీలో ఉండడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.అత్తింట్లో వేధింపులు..నిప్పంటించుకున్న భార్య..రక్షించకుండా వీడియోతీసిన భర్త


వివరాల్లోకి వెళితే..కోట జిల్లాలోని మందనా పట్టణానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతం సమీపంలో ఓ గ్రామంలో ఉంటున్న వరుసకు మామ అయ్యే వ్యక్తి ఇంట్లో జరిగే వివాహానికి
20ఏళ్ల యువతి నవంబర్9న తనకు వెళ్లింది. అలా వెళ్లిన ఆమెకు ఆ చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలను చూడడాలని ఆశపడింది. అలా ఇంటి నుంచి బయటకు వచ్చింది. అదే సమయానికి బుండి జిల్లాకు చెందిన ఫోరులాల్ అనే 22 ఏళ్ల యువకుడు ఆమె అలా పరిసరాలు చూసుకుంటూ వస్తున్న విషయాన్ని గమనించాడు.నవ్వు ఎవరు? ఇక్కడ నిన్నెప్పుడూ చూడలేదే..ఎక్కడకొచ్చావ్? ఎక్కడికి వెళుతున్నావ్? అని అడిగాడు. దానికి ఆమె తన మేనమామ ఇంటిలో జరిగే పెళ్లికి వచ్చానని ఇక్కడకు దగ్గరలోఅందమైన ప్రదేశాలు ఏమన్నా ఉన్నాయా? చూడాలని ఇలా వచ్చానని చెప్పింది. దానికి అతను ఈ చుట్టు పక్కల ఇంకా అందమైన ప్రదేశాలు ఉన్నాయి..అడవిలో చాలా వింతలు ఉన్నాయి చూపిస్తాను వస్తావా?అని అడిగాడు.దానికి ఆమె తెగ సంబరపడిపోయింది. కానీ అతని మాయలో పడుతున్నానని తెలుసుకోలేకపోయింది. అలా అతనితో కలిసి వెళ్లింది.ఆమె ఒప్పుకున్నదే తడవుగా ఆ యువకుడు ఓ మోటర్ బైక్ తెచ్చాడు. అతన్ని నమ్మిన ఆ యువతి ఆ వ్యక్తి మోటారు సైకిల్‌ ఎక్కింది. అలా ఆమెను కోట జిల్లాలోని మందనాకు దగ్గరలో ఉండే ఓ అడవికి తీసుకెళ్లాడు. అక్కడకు వెళ్లిన తర్వాత ఫోరులాల్ ఆ యువతి కాళ్లు చేతులు కాట్టేశాడు. దానికి ఆమె అరుస్తూ ‘‘ఏంటీ నువ్వు చేస్తున్నా పని నాకేం చెప్పి తీసుకొచ్చావ్..నన్ను వదిలిపెట్టు’’ అంటూ వేడుకుంది. దానికి అతను నాకు భలే చిక్కావ్ నిన్ను వదిలేది లేదంటూ అలా ఒకటీ రెండూ కాదు 14 రోజుల పాటు ఆమెపై దారుణంగా అత్యాచారాలకు పాల్పడ్డాడు.ఆ 14 రోజుల తర్వాత ఫోర్ లాల్ ఆమెను అక్కడే కట్టేసి ఉంచి బయటకు వెళ్లాడు. దీంతో అతని నుంచి తప్పించుకునేందుకు ఇదే అదనుగా భావించిన ఆమె అతనితో జరిగిన ఘర్షణలో అక్కడే ఎక్కడో పడిపోయిన తన మొబైల్ ను వెతికింది. కానీ దొరకలేదు. ఈ ఛాన్స్ తప్ప మరో దారి లేదని భయంతోను..ఆశగానూ తన ఫోన్ ను వెదికింది. అలా ఎట్టకేలకు కొన్ని గంటల తరువాత ఫోన్ దొరకటంతో సంతోషపడింది. వెంటనే తండ్రికి ఫోన్ చేసింది. అప్పటికే కూతురు కనిపించట్లేదని అల్లాడిపోతున్న ఆ తండ్రి కూతురు నుంచి ఫోన్ వచ్చేసరికి ఆతృతపడ్డాడు. ఏంజరిగిందోనని భయపడ్డాడు.తండ్రికి జరిగిన విషయాన్ని మొత్తం చెప్పింది.దీంతో తాను భయపడిందంతా జరిగిందని ఆవేదన చెందుతూనే కూతుర్ని రక్షించుకోవటానికి వెళ్లాడు.దీంతో బాధితురాలి తండ్రి ఆమె చెప్పిన ప్రదేశానికి వెళ్లి కూతురును తీసుకెళ్లి..బారన్ జిల్లాలోని ఆంటా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి ఉమేష్ మనరియా తెలిపారు. పరీక్షల కోసం బాధితురాలిని హాస్పటల్ కు తరలించామని తెలిపారు.నిందితుడిని త్వరలోనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *