లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఒకే గ్రామంలో 38 మంది మ‌హిళ‌లు, చిన్నారుల‌ను కిడ్నాప్! మారణాయుధాలతో 100మంది దుండగుల అరాచకం..

Published

on

Rajasthan  village 38 kidnapped women children : ఒకే గ్రామంలో ఏకంగా 38మంది మహిళలు, చిన్నారులు కిడ్నాప్ కు గురైన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. 100మంది ముఠాగా వచ్చిన దుండగులు కత్తులు, ఇనుపరాడ్లతో పాటు పలుమారణాయుధాలతో ఓగ్రామంలో ప్రవేశించి బీభత్సం సృష్టించారు. 38మంది మహిళలతో పాటు చిన్నారుల్ని అపహరించారు. ఈ ఘటనతో గ్రామస్థుల సమాచారంతో  వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

రాజ‌స్థాన్‌లోని రత్లాం జిల్లా ఉన్హేర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని బామ‌న్ దేవ‌రాజ‌న్ గ్రామంలో కిడ్నాప్‌లు తీవ్ర క‌ల‌క‌లం సృష్టించాయి. ఒక‌రిద్ద‌రిని కాదు ఏకంగా 38 మంది మ‌హిళ‌లు, చిన్నారుల‌ను కిడ్నాప్ చేశారు. వీరందిరినీ కిడ్నాప్ చేసింది కూడా ప‌ది, ఇర‌వై మంది స‌భ్యుల ముఠా కాదు.. ఏకంగా 100 మంది క‌త్తులు, ఇనుపరాడ్లు వంటి ఆయుధాల‌తో పలు వాహనాల్లో దేవ‌రాజ‌న్ గ్రామంలో బీభత్సం సృష్టించారు.

మ‌హిళ‌లు, చిన్నారుల‌ను నిర్బంధించారు. అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు వెంటనే పోలీసుల‌కు స‌మాచారం అందించగా..హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న సినీ ఫక్కీలో పోలీసులు కిడ్నాప‌ర్ల నుంచి మ‌హిళ‌లు, చిన్నారుల‌ను కాపాడారు.

100 మంది నిందితుల్లో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. దుండ‌గులంతా ర‌త్లాం జిల్లా అలోట్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని వారు అని పోలీసుల విచార‌ణ‌లో వెల్లడైంది.

ఈ ఘటనపై రత్లం జిల్లా ఎస్పీ కిరణ్ కాంగ్ సిద్ధూ మాట్లాడుతూ..కిడ్నాప్ అయిన 38మంది మహిళలు చిన్నారుల్ని సురక్షితంగా రక్షించామని తెలిపారు. అస‌లు మ‌హిళ‌లు, చిన్నారుల‌ను కిడ్నాప్ ఎందుకు చేయాల్సి వ‌చ్చిందో పోలీసులు విచారిస్తున్నామని.. ఈ సామూహిక కిడ్నాప్ ల వెనుకు ఎవరున్నారు? వారిని ఎందుకు కిడ్నాప్ చేశారు? దీని వెనుక ఏమన్నా కుట్ర ఉందా? అనే పలు అంశాలపై పోలీసులు విచారణను వేగవంతంచేశామని తెలిపారు. మిగ‌తా వారి ఆచూకీ కోసం పోలీసులు పలు బృందాలను ఏర్పాటుచేసి గాలింపును ముమ్మరంచేశామని వెల్లడించారు.