రాజస్థాన్ భోణీ.. పోరాడి ఓడిన ధోనీసేన

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఐపీఎల్-2020 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఆఖరి ఓవర్‌లో కరన్ వేసిన బంతిని సిక్సర్లగా మలిచాడు ధోనీ. వరుసగా మూడు బంతుల్ని బౌండరీ దాటించాడు. మొత్తం 21 పరుగులు వచ్చాయి..

బంతులు ఇంకా మిగిలి లేవు.. ఇంకా రెండు ఫోర్లు సాధిస్తే చెన్నై ఖాతాలో మరో విజయం వచ్చి చేరేది..

కానీ, రాజస్థాన్ బౌలర్లు కట్టదిట్టమైన బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ చెన్నైపై 16పరుగుల తేడాతో గెలిచి ఈ టోర్నీలో భోణీ కొట్టింది.

రాజస్థాన్ నిర్దేశించిన 217 భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ధోనీసేన విఫలమైంది.డుప్లెసిస్ (72) ఒక్కడే హాఫ్ సెంచరీ దాటేశాడు. మిగతా చైనా బ్యాట్స్ మెన్లంతా పేలవ ప్రదర్శనతో స్వల్ప స్కోరుకే పరిమితయ్యారు..

నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 6 వికెట్ల నష్టానికి 200 పరుగులకే ఓటమి పాలైంది.ఓపెనర్ గా బరిలోకి దిగిన మురళీ విజయ్ (21) పరుగులు చేయగా, షేన్ వాట్సన్ (33) పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన డుప్లెసిస్ వీర బాదుడు బాదాడు.. చెన్నై స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. డుప్లెసిస్ హాఫ్ సెంచరీ వృథా అయింది.

అతడి తర్వాత వచ్చిన ఆటగాళ్లంతా వరుస బెట్టి పెవిలియన్ చేరారు. కరన్ (17), గైక్వాడ్ (0), కేదార్ జాదవ్ (22), కెప్టెన్ ధోనీ (29), జడేజా (1) పరిమతమయ్యారు.రాజస్థాన్ బౌలర్లలో రాహుల్ తివాతియా మూడు వికెట్లు తీసుకోగా, ఆర్చర్, గోపాల్, కరన్ తలో వికెట్ తీసుకున్నారు.

అంతకుముందు రాజస్థాన్ రాయల్స్‌ ప్లేయర్ సంజూ శాంసన్‌ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెన్నై బౌలర్లకు చెమటలు పట్టించాడు.

సంజూ శాంసన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.. సిక్సర్ల మోత మోగించి 19 బంతుల్లో 1 ఫోర్‌, 6 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ సాధించాడు.

స్మిత్, ఆర్చర్ కూడా చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు సాధించింది. చెన్నైకు 217పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని అందించింది.

రాజస్థాన్ తొలి మ్యాచ్ శుభారంభం చేయడంతో పాయింట్ల పట్టికలో రెండు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఒకటి గెలిచినా ఒకటి ఓడిపోవడంతో రెండు పాయింట్లతో పట్టికలో నాల్గో స్థానంలో నిలిచింది.

Related Posts