లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

టైమింగ్ కన్నా ప్రాణం మిన్న..నాలుగు ప్రాణాలు కాపాడటానికి లేట్ గా బయల్దేరిన విమానం

Published

on

Rajasthan to Delhi flight “Retrieved Organs To Save Four Lives” : ఎయిర్ ఇండియా ప్రాంతీయ అనుబంధ సంస్థ అలయెన్స్ ఎయిర్ విమానం నాలుగు ప్రాణాలు బతికించేందుకు జైపూర్ నుంచి ఢిల్లీకి ఆలస్యంగా బయలుదేరింది. ‘ఆలస్యం అమృతం విషం’’అన్నారు పెద్దలు కానీ ఒక్కోసారి ఆలస్యం కూడా ప్రాణాలు కాపాడుతుంది. ఇదిగో అలయొన్స్ విమానం లేట్ గా బయలుదేరటానికి కారణం కూడా అదే.వివరాల్లోకి వెళితే..జైపూర్‌కు చెందిన 49 ఏళ్ల మహిళ తన ప్రాణాలు కోల్పోతూ కూడా మరికొంతమంది ప్రాణాలు నిలబెట్టాలనుకుంది. తన అవయవాలను దానం చేసి ప్రాణాలు విడిచింది. అదే సమయంలో ఢిల్లీలో నలుగురు వ్యక్తులు అవయవదాతల కోసం ఎదురుచూస్తూ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఆ మహిళ నుంచి సేకరించిన కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీలు సకాలంలో సదరు నలుగురు పేషెంట్లకు అమర్చితే వారు బతికే అవకాశం ఉంది.వారణాసికి ప్రధాని మోడీ.. సిక్స్ లేన్ హైవే ప్రారంభోత్సవం!


ఈ పరిస్థితుల్లో రాజస్థాన్ సీఎం కార్యాలయం, స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (ఎస్ఓటీటీఓ), ఎయిర్‌లైన్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), జైపూర్ విమానాశ్రయం రంగంలోకి దిగాయి. ఆయా సంస్థలు సమన్వయం చేసుకుని ఆ నాలుగు ప్రాణాల్ని కాపాడాలనుకున్నాయి. దీంతో జైపూర్ నుంచి ఢిల్లీకి బయలుదేరే అలయెన్స్ ఎయిర్‌కు చెందిన తొలి విమానంలో చనిపోయిన మహిళ నుంచి సేకరించిన అవయవాలను తరలించాలని నిర్ణయించాయి. నిజానికి ఆ విమానం ఉదయం 8.15 గంటలకు బయలుదేరాల్సి ఉంది.దాని కోసం విమానం బోర్డింగ్ కూడా పూర్తయింది. ప్రయాణికులు టేకాఫ్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ అంతకంతకూ లేట్ అవుతోంది. ఏం జరిగిందో ప్రయాణీకులకు అర్థం కాలేదు. అయితే అవయవాలు విమానాశ్రయానికి చేరే వరకు విమానాన్ని ఎగరనివ్వకుండా ఆపాల్సి వచ్చింది.
ఎయిర్ ఇండియా, అలయెన్స్ ఎయిర్ మేనేజ్‌మెంట్‌ల నిర్ణయంతో విమానం టేకాఫ్ కాకుండా నిలిచిపోయింది. ఆలస్యం కావటంతో ప్రయాణీకులు అసహనం వ్యక్తం చేశారు. కానీ అసలు విషయం తెలుసుకుని ఏం ఫరవాలేదు. ఆ నలుగురు ప్రాణాలు కాపాడితే అంతే చాలు అని అన్నారు. అవయవాలు విమానం వద్దకు చేరుకునే వరూ ఓపిగ్గా ఎదురుచూశారు.అలా జైపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అవయవదాత నుంచి అతి క్లిష్టమైన ఆపరేషన్ ద్వారా రెండు ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు వేరు చేసిన డాక్టర్లు ఎయిర్ పోర్టుకు చేరుకునేసరికి 9.28 గంటలు అయింది. వాళ్లు వచ్చిన వెంటనే విమానం టేకాఫ్ తీసుకుని ఢిల్లీకి బయలుదేరింది.అలా ఆ నలుగురి ప్రాణాలు నిలబెట్టడంలో తమ పాత్రను నిర్వహించేందుకు ప్రయాణీకలను వేచి ఉంచేలా చేయాల్సి వచ్చిందనీ..కానీ వారి సహకారంతో అనుకున్నది చేయగలిగామని అలయెన్స్ ఎయిర్ సీఈవో హర్‌ప్రీత్ ఎ డె సింగ్ తెలిపారు. తమ సిబ్బందిని అభినందించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *