లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

IPL-2020

MI vs RR IPL 2020: హార్ధిక్ మెరుపులు.. ముంబై భారీ స్కోరు.. రాజస్థాన్ టార్గెట్ 196

Published

on

RR vs MI, IPL 2020: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ 45 వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అబుదాబి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై 195పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరం అవగా.. కిరోన్ పొలార్డ్ సారధ్యంలో రెండోసారి కెప్టెన్‌గా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది ముంబై జట్టు. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 195 పరుగులు చేసింది.హార్ధిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఈ స్కోరు సాధ్యం అయ్యింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్.. మొదటి ఓవర్లోనే క్వింటన్ డికాక్ వికెట్ కోల్పోయింది. సిక్సర్ కొట్టిన తరువాత డికాక్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రెండో వికెట్‌కు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ 80 పరుగుల భాగస్వామ్యం అందించారు. జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన క్యాచ్ కారణంగా కిషన్ 36బంతుల్లో 37 పరుగులు చేసి అవుటయ్యారు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ మూడో వికెట్ అవుట్ అయ్యాడు. 26 బంతుల్లో 40 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.సౌరభ్ తివారీ 25బంతుల్లో 34పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో స్టోక్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ పోలార్డ్ ఈ మ్యాచ్‌లో మాత్రం పెద్దగా రాణించలేదు. 4బంతుల్ో ఒక సిక్సర్ మాత్రమే కొట్టి పెవిలియన్ చేరుకున్నాడు. తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా క్రీజులో నిలబడి రాజస్థాన్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు. ఈ క్రమంలోనే 21బంతుల్లో 60పరుగులు చేసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ కారణంగా రాజస్థాన్ టార్గెట్ 196పరుగులుగా అయ్యింది. క్రూనాల్ పాండ్యా 4బంతుల్లో 3పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.రాజస్థాన్ బౌలర్లలో జెఫ్రా ఆర్చర్ తన నాలుగు ఓవర్లలో 31పరుగులు ఇచ్చి 2వికెట్లు తియ్యగా.. అంకిత్ రాజ్‌పూత్ భారీ స్కోరు సమర్పించుకున్నాడు. తన నాలుగు ఓవర్లలో 60పరుగులు ఇచ్చుకున్నాడు. తన చివరి ఓవర్‌లో ఏకంగా 27పరుగులు ఇచ్చుకున్నాడు. కార్తీక్ త్యాగి తన నాలుగు ఓవర్లలో 45పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. శ్రీయాస్ గోపాల్ 2వికెట్లు తీసుకోగా.. రాహుల్ తెవాటియా తన నాలుగు ఓవర్లలో 25పరుగులు ఇచ్చాడు.ప్లేఆఫ్ రేస్‌కు ఈ మ్యాచ్ చాలా ముఖ్యం. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు గెలిస్తే ఆ జట్టు నేరుగా ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. అదే సమయంలో, ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు గెలిస్తే ప్లేఆఫ్ రేసులో నిలుస్తుంది.