లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

కిరాతకులు : మహిళపై సామూహిక అత్యాచారం, దారుణంగా ప్రవర్తించారు

Updated On - 1:28 pm, Wed, 27 January 21

Rajasthan woman raped by three men, brutalised : రాజస్ధాన్ లో దారుణం జరిగింది. 25 ఏళ్ళ యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం జరిపారు, ఆమె ప్రతిఘటించబోతే ఆమె శరీరంలోకి బాటిల్ పంపించారు. నాగౌర్ జిల్లా గంగ్వా గ్రామనాకి చెందిన దళిత మహిళ జనవరి 19న పొలానికి వెళ్ళింది.

అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి ప్రయత్నాన్ని ఆమె అడ్డుకోగా వారు గాజు సీసాను ఆమె సున్నిత భాగాల్లోకి చొప్పించి చిత్రహింసలకు గురిచేశారు, ఈ సంఘటన ఎవరికైనా చెపితే మరింత తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

నిందితుల బెదిరింపులకు భయపడిన మహిళ మొదట ఆస్పత్రిలో చేరి చికిత్స పొందింది. సోమవారం జనవరి 25న పర్బత్ సర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నిందితులైన పంచూరం జాట్, కనారామ్ జాట్, శ్రావన్ గుర్జర్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులకోసం గాలింపు చేపట్టారు.