Home » రెండో పెళ్లి చేసుకోనన్న కోడలు..ముక్కూ నాలుక తెగ్గోసి..చేయి విరిచేసిన అత్తమామలు
Published
2 months agoon
By
nagamaniRajasthan woman’s in-laws nose, tongue cutting : భర్త చనిపోయిన వేదన తీరకుండానే మరో వివాహం చేసుకోవాలని వేధింపులు భరించలేకపోయింది ఓ వింతంతువు. రెండో పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయటాన్ని తట్టుకోలేకపోయింది. చిత్రహింసలు పెడుతున్నా సహించింది. భరించింది. కానీ విచక్షణ మరచిన కుటుంబం హింసలకు అద్దు అదుపులేకుండా పోయింది.చివరికి ఆమె ముక్కు..నాలుకను కోసేశారు. ఓచేయి కూడా విరిచేశారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లో జైసల్మేర్ లో జరిగింది. మంగళవారం మధ్యాహ్నాం 1గంటల (నవంబర్ 17,2020) జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే.. జైసల్మేర్ జిల్లాలోని 28 ఏళ్ల వితంతువు రెండో పెళ్లి చేసుకోవటానికి నిరాకరించింది. దీంతో ఆమె అత్తమామలు ఆమె ముక్కును, నోటిలోని నాలికను తెగ్గోశారు. ఓ చేయి కూడా విరిచేసారు. తన సోదరికి జరిగిన ఈ దారుణంపై ఆమె సోదరుడు ఠాణీ బీసర్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా..సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను ఆరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న మరికొందరిని గాలించే పనిలో పడ్డారు. బాధితురాలిని చికిత్స కోసం జోధ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాధితురాలు సోదరుడు బీసర్ ఖాన్ మాట్లాడుతూ.. తన సోదరి గుడ్డీకి ఆరేళ్ల క్రితం కోజె ఖాన్‌తో పెళ్లి జరిపించాం. పెళ్లయిన ఏడాదికే మా బావ కోజె ఖాన్ చనిపోయాడు. దీంతో నా చెల్లెలిని ఆమె అత్తారింటివారు వారి బంధువునే మరో వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయటం ప్రారంభించారు.
ఆమెను వారి బంధువుకి ఇచ్చి వివాహం చేస్తే సదరు వ్యక్తి వారికి కొంత ఆస్తి ఇస్తామని చెప్పారని..ఆ ఆస్తి కోసం ఆమెను రెండో వివాహం చేసుకోవాటానికి నా సోదరి ఒప్పుకోలేదు. దీంతో ఆమెను నానా చిత్రహింసలకు గురిచేసేవారు. అయినా ఆమె రెండో వివాహం చేసుకోవటానికి అంగీకరించలేదు.
ఇటీవల ఆమెపై అత్తింటివారి వేధింపులు..చిత్రహింసలు ఎక్కువయ్యాయనీ..దాంట్లో భాగంగానే అత్తమామలతో పాటు మరికొంతమంది ఆమెపై దాడి చేసి, ముక్కు, నాలిక తెగ్గోయడంతో పాటు ఆమె ఎడమ చేతిని కూడా విరగ్గొట్టారని తెలిపాడు. ఆమెను కాపాడేందుకు వచ్చిన నా తల్లిపై కూడా దాడి చేశారనీ వాపోయాడు. నా చెల్లిని ఇంతగా వేధించిన ఆమె అత్తింటివారిపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాడు బీసర్ ఖాన్.