Home » బాలు.. జీవితంలో ముఖ్యమైన ఆ రెండు నాకిచ్చారు..
Published
2 months agoon
By
sekharRajendra Prasad: గాన గంధర్వులు, సంగీత జ్ఞాని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం సినిమా, సంగీత ప్రియులను, అభిమానులను ఎంతోగానో కలిచివేసింది.
బాలు అకాల మరణం ఆయన సన్నిహితులను, ఆయనతో కలిసి పనిచేసిన వారిని తీరని శోకంలో ముంచెత్తింది. ఇటీవల నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, బాలు గారిని స్మరించుకుంటూ.. తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
మనిషి జీవితంలో పెళ్లి, చావు అనేవి ముఖ్యమైనవి. వీటికి సంబంధించిన మెయిన్ సాంగ్స్ బాలు గారు నాకు పాడారు.. ఆ సినిమాలు.. ‘పెళ్లిపుస్తకం’, ‘ఆ నలుగురు’..
‘‘పెళ్లిపుస్తకం’ లో ‘శ్రీరస్తు శుభమస్తు’ అనే పాట లేకుండా ఎవరూ పెళ్లి చేసుకోరు.. అలాగే ‘ఆ నలుగురు’ సినిమాలోని ‘ఒక్కడై రావడం.. ఒక్కడై పోవడం’ అనే పాట కూడా..
ఈ రెండు సంఘటనల గురించి తన మధురమైన గాత్రంతో మెమరబుల్ సాంగ్స్ నాకు పాడారు. కానీ, ఇలా నన్ను ఒక్కడినే వదిలేసి వెళ్లిపోవడం ఏం బాగోలేదు డార్లింగ్..’’ అంటూ రాజేంద్ర ప్రసాద్, బాలు గారిని గుర్తు చేసుకున్నారు.