లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

తలైవా పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్‌ : రజనీ వస్తారా? రారా? ఇవాళ తేలిపోనుంది!

Published

on

Rajinikanth To Decide On Political Plunge : తలైవా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా? ఆయన రాజకీయం పయనంలో రజనీ దారెటు.. కొన్ని గంటల్లో తేలిపోనుంది.. రజనీ అభిమాన సంఘాల నేతలతో రజనీకాంత్‌ రాఘవేంద్ర కల్యాణ మండపం వేదికగా సోమవారం (నవంబర్ 30) సమావేశం కానున్నారు.రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే పార్టీతో అసెంబ్లీ ఎన్నికల్లో తలపడదామంటూ తలైవా రజనీకాంత్‌ ప్రకటన చేసి సరిగ్గా మూడేళ్లు అవుతోంది. రజనీ మక్కల్‌ మండ్రం, కార్యవర్గం నియామకం, సభ్యత్వ నమోదు పేరుకే అలా ఉండిపోయాయి. పార్టీనే పెట్టలేదు.

అయితే ఇప్పుడు రజనీ కాంత్ పోలిటికల్‌ ఎంట్రీకి ముహుర్తం కుదిరిందా? సొంత పార్టీని ప్రకటించబోతున్నారా? ఇన్ని ఏళ్ల సస్పెన్స్‌కు తెరపడినట్టేనా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం నేడు తెలియనుంది.

రజనీ తన అభిమాన సంఘాల నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఓ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.తలైవా పొలిటికల్ ఎంట్రీ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అభిమాన సంఘాలతో అనేక సార్లు సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు రజనీ. కానీ ఇప్పటివరకు ఆయన తన రాజకీయ ప్రవేశంపై ఎప్పుడూ స్పష్టతనివ్వలేదు.

వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగననున్నాయి. అప్పటివరకైనా దళపతి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా.. ఇవ్వరా అన్న చర్చ జరుగుతోంది. ఈ సమయంలో ఇవాళ తన అభిమాన సంఘాల నేతలతో బాషా సమావేశంకానున్నారు.మళ్లీ రజనీ పొలిటికల్ ఎంట్రీపై ఉత్కంఠను రేపుతోంది. రజనీ తన పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేయనున్నారనే వార్త తమిళనాట చక్కర్లు కొడుతోంది.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ‘ఫాదర్ ఆఫ్ తెలుగు OTT’


అభిమాన సంఘం సంస్థ అయిన రజనీ మక్కల్‌ మండ్రమ్‌ జిల్లా కార్యదర్శులను ఆయన ఆహ్వానించారు.

ఈ సమావేశానికి పోలీసుల అనుమతి కూడా తీసుకున్నారు.. సమావేశం అనంతరం రజనీ తన పొలిటికల్‌ ఎంట్రీపై ఖచ్చితంగా ప్రకటన చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత రాజకీయ శూన్యత ఏర్పడింది.

దీంతో మూడేళ్ల క్రితం రాజకీయాల్లోకి వస్తున్నట్లు స్వయంగా కబాలి హడావుడి చేశారు. తన పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేసి మూడేళ్లు గడిచినా ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టనేలేదు.తమిళ రాజకీయాలు తెరపైకి వచ్చిన ప్రతీ సందర్భంలోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ పక్కా అంటూ ప్రచారం జరిగింది. అయినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు.

పొలిటికల్‌ ఎంట్రీపై ముహుర్తం సైతం ఖరారు చేయలేదు. ఆయన తన పొలిటికల్‌ ఎంట్రీపై నాన్చూతూనే ఉన్నారు.

అసలు తలైవా రాజకీయాల్లోకి వస్తారా? రారా? అన్న డైలమా కూడా అభిమానుల్లో మొదలైంది.

రజనీకాంత్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని… సింగపూర్ వెళ్లి ట్రీట్‌మెంట్‌ కూడా చేయించుకున్నారన్న వార్తలు వైరల్ అయ్యాయి.ప్రస్తుతం కరోనా నేపథ్యంలో రజనీకాంత్ ఆరోగ్యంపై డాక్టర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ బయట తిరగటం అంత మంచిది కాదంటూ వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో రజనీ ఆరోగ్యంపై అభిమానుల్లోనూ ఆందోళన నెలకొంది.అందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు రజనీకాంత్ ప్రకటించినట్లు ఓ లేఖ వైరల్ అయింది. అయితే ఈ వార్తలపై రజనీ రియాక్ట్‌ అయ్యారు.

తాను రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని స్పష్టం చేస్తూనే.. తన ఆరోగ్యం గురించి కొన్ని వివరాలు నిజమేనని వివరణ ఇస్తూ ఓ లేఖను పోస్ట్ చేశారు.అభిమాన సంఘాలతో చర్చించాక రాజకీయ పార్టీ ప్రకటనపై తుది నిర్ణయం తీసుకుంటానని ముత్తు క్లారీటీ ఇచ్చారు. రజనీ చెప్పిన అభిమాన సంఘాల నేతలతో సమావేశం ఇవాళ జరగనుంది.

ఈ సమావేశం తర్వాతైనా భాషా ఓ స్పష్టతా ఇస్తారా? లేక తన సస్పెన్స్ థిల్లర్‌ను కొనసాగిస్తారా? వేచి చూడాలి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *