చైనా సరిహద్దులకు వెళ్లిన రాజ్ నాథ్, శాస్త్ర పూజ, సైనికులతో ఒకరోజు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Rajnath Singh To Perform Shastra Puja : దసరా నాడు ఆయుధ పూజ చేయడం సంప్రదాయం. గడిచిన కొన్ని ఏళ్లుగా రాజ్ నాథ్ సింగ్ ఆయుధ పూజ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం రక్షణ మంత్రిగా ఉన్న ఆయన చైనా సరిహద్దులోకి వెళ్లారు. వాస్తవాధీన రేఖకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిక్కి షెరాథాంగ్ వద్ద ఆదివారం ‘శాస్త్ర పూజ’ నిర్వహించనున్నారు.చైనాతో నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభన నేపథ్యంలో…ఒక రోజు ఆయన సైనికులతో ఆయన గడుపుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవాధీన రేఖకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఆయన ఆయుధ పూజను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు.శనివారం నాడు సిక్కిం చేరుకున్న రాజ్ నాథ్ కు అక్కడి సైనిక అధికారులు స్వాగతం పలికారు. పశ్చిమ బెంగాల్, సిక్కింలో రెండు రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవనేతో డార్జిలింగ్‌లో జిల్లాలో 33 కార్ట్స్‌ (తిశక్తి కార్ప్స్‌)తో శనివారం సమావేశం నిర్వహించారు.అక్కడ సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితి ఉందో టాప్ కమాండర్లు వివరించారు.
సరిహద్దు రక్షణలో సేవలు చేస్తున్న సైనికులను ప్రశంసించారు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోందన్నారు. రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు సందర్భంగా గతేడాది ఫ్రాన్స్‌ ఓడరేవు నగరం బోర్డాలో రక్షణ మంత్రి శాస్త్ర పూజ నిర్వహించారు.

Related Tags :

Related Posts :