Rakhi Sawant hilariously Calls Out Mukesh Ambani Over Jio Network Issues!

Extra మనీ తీసుకో.. నెట్‌వర్క్ ఇవ్వు: అంబానీపై రాఖీ సావంత్ TikTok

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్.. పేరు వింటనే నవ్వు ఆపుకోలేరు. ఆమె మాటలకు ఎవరైనా మంత్రముగ్ధులైపోవాల్సిందే. కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించే ఈ అమ్మడు వీడియోలు చూస్తే నవ్వులే నవ్వులు.. టీవీ షోల్లో కనిపిస్తే ఎంతో హుందాగా ఉండే ఈ భామ.. సోషల్ మీడియాలోకి రాగానే తన అందచందాలను ఆరబోస్తూ హల్ చల్ చేస్తుంటుంది. కొన్నాళ్ల క్రితం దీపక్ కలాల్ ను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన రాఖీ సావంత్.. ఈసారి రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీనిపై సెటైర్లు వేసి మరోసారి వార్తల్లో నిలిచింది.

తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఏకంగా అంబానీపైనే TikTok వీడియోను చేసి మరోసారి నవ్వులు పంచింది. టిక్ టాక్ వీడియోలో తనదైన మాటలతో అంబానీపై సెటైర్లు వేసింది. జియో నెట్ వర్క్ సమస్యలపై ఏకిపారేసింది. ‘అంబానీ.. ఓ అంబానీ.. రూ50-60 అదనంగా ఇస్తా తీసుకో.. కనీసం మంచి నెట్ వర్క్ అందించు’ అని రొమాంటిక్ గా టిక్ టాక్ చేసింది. ఆ వీడియోలో తన కోపం మొత్తాన్ని తనదైన హవాభావాలతో హాస్యాన్ని పంచింది.ఇప్పుడు ఈ టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇటీవలే సావంత్.. యూకేకు చెందిన వ్యక్తితో తనకు వివాహం జరిగిందని రివీల్ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే ఓ కొత్త వీడియోను పోస్టు చేసింది. అందులో ఇదే తన కొత్త ఖరీదైన ఇల్లుగా చూపించింది. వీడియోలో ఎరుపు రంగుతో కూడిన గది ఉండగా, ఫ్యాన్సీ బెడ్, డేకరేషన్ చేసి ఉంది. దీనికి ఇదే.. నా ఇల్లు అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

Related Posts