రక్షాబంధన్ గుర్తు చేసుకుంటూ సుషాంత్ సిస్టర్ ఎమోషనల్ పోస్ట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సుషాంత్ సింగ్ రాజ్ పుత్ సిస్టర్ శ్వేతా సింగ్ కీర్తి రక్షాబంధన్ సందర్భంగా సోదరుడ్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ నోట్ పోస్టు చేసింది. రక్షాబంధన్ ను సోదరుడు సుషాంత్ తో సెలబ్రేట్ చేసుకోవడాన్ని మిస్ అయ్యానంటూ బాధను వ్యక్తం చేసింది. దాంతోపాటు లేట్ బ్రదర్ కు హార్ట్ వార్మింగ్ నోట్ ను డెడికేట్ చేస్తూ పోస్టు పెట్టింది.‘హ్యాపీ రక్షాబంధన్ మేరా స్వీట్ సా బేబీ. బహుత్ ప్యార్ కర్తే హై హమ్ ఆప్కో జాన్ ఔర్ హమేశా కర్తే రహేంగే’ మేం ఎప్పుడూ నిన్ను చాలా ప్రేమిస్తూనే ఉంటాం అని శ్వేతా రాసింది. దాంతో పాటు చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటూ రాఖీ సెలబ్రేషన్స్ లో ఎలా గడిపామోనని గుర్తుచేసుకుంది. నువ్వు ఇప్పుడు, అప్పుడు, ఎప్పుడూ మాలో గొప్పదనమే’ అని అభిప్రాయపడింది.

థ్యాంక్యూ శ్వేతా.. వెలకట్టలేని చిన్ననాటి గుర్తులను మాతో పంచుకున్నందుకు అంటూ కామెంట్ కురిపిస్తున్నారు. సుషాంత్ చనిపోయినప్పటి నుంచి అతని అక్క శ్వేతా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టులు పెడుతూనే ఉంది. గత వారం పెట్టిన పోస్టులో మేఘాల ఫొటోను ఉంచుతూ. ‘అతను ఛార్మింగ్ అవడానికి ముందే.. అందమైన చిరునవ్వు, మెరిసే కళ్లతో అందరినీ విస్మయానికి గురిచేశాడు’ అని శ్వేతా పంచుకుంది.అంతకంటే ముందు నిన్ను మరోసారి చేతులారా తాకాలని కోరుకుంటున్నానంటూ ఒక పోస్టు పెట్టింది. సుషాంత్ చనిపోయిన నెలరోజులకో పోస్టు.. ‘నువ్వు మమ్మల్ని వదిలి నెల గడిచింది. నువ్వున్నప్పటి గురుతులు ఇంకా మమ్మల్ని వెంటాడుతున్నాయి. నువ్వెక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా’ అని అందులో పేర్కొంది.

Related Posts