పది గంటలకు రక్షణ మంత్రి కీలక ప్రకటన.. ఇది చాలా ముఖ్యమైనది!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ(9 ఆగస్ట్ 2020) ఉదయం 10 గంటలకు ఒక ముఖ్యమైన ప్రకటన చేయనున్నారు.

ఈ సమాచారాన్ని రక్షణ మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. అయితే, రాజ్‌నాథ్ సింగ్ ఏమి ప్రకటిస్తారనే దానిపై ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

అయితే ఇది మాత్రం చాలా పెద్ద విషయం అని మాత్రం వారు చెబుతున్నారు. గత నెలలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజుల లడఖ్, కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చైనా, పాకిస్తాన్ విషయంలో ఏం చెయ్యాలనే దానిపై భారత సైన్యం సలహాలను తీసుకున్నారు.

చైనా లేదా పాకిస్తాన్ నుంచి యుద్ధం లేదా అటువంటి పరిస్థితి తలెత్తితే ఎలా ఎదుర్కోవాలి అనేదానిపై కొన్ని సంవత్సరాలుగా భారత సైన్యం వ్యూహం వేస్తుంది. యాక్చురియల్ కంట్రోల్ లైన్‌లో, అంటే తూర్పు లడఖ్‌కు చెందిన ఎల్‌ఐసిలో చైనాతో పరిస్థితి మరింత దిగజారితే, పాకిస్థాన్‌తో పాటు చైనాతో భారత్‌ వ్యవహరించాల్సి ఉంటుందని భారత్‌కు పూర్తి అంచనా ఉంది.

Related Posts