లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌.. నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్..

Published

on

RED Movie: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన మాస్ థ్రిల్లర్.. ‘రెడ్’. కిశోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ఈ చిత్రంలో రామ్.. సిద్ధార్థ్, ఆదిత్య క్యారెక్టర్లలో ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నాడు. లాక్ డౌన్ కారణంగా విడుదల వాయిదా పడింది. ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు అంటూ రకరకాల వార్తలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొని ధైర్యంగా థియేటర్లలోనే రిలీజ్ చేశారు.

RED

సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రెడ్’ మార్నింగ్ షో నుంచే మంచి టాక్‌తో 50 శాతం ఆక్యుపెన్సీ అయినా సరే హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అంతేకాదు కేవలం రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌కి రావడం మరో విశేషం.

RED

రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లతో ‘రెడ్’ 2021 సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. హీరో హీరోయిన్ల నటన, దర్శకుడి టేకింగ్, మణిశర్మ సంగీతం, నిర్మాణ విలువలు ‘రెడ్’ చిత్రాన్ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి. ఐదవ రోజు నుంచి వచ్చే కలెక్షన్ అంతా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలే.. ఫుల్ రన్‌లో ‘రెడ్’ ఏ స్థాయి వసూళ్లు రాబడుతుందో చూడాలి మరి.