Ramadan 2020 Salman Khan Fans In Despair

Ramadan 2020 : నిరుత్సాహంలో సల్మాన్ ఫ్యాన్స్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కి రంజాన్ ఎప్పుడూ స్పెషలే. ఈ ఫెస్టివల్ సీజన్ లో డబుల్ జోష్ తో సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్యాన్స్. కాని ఈ ఏడాది మాత్రం రంజాన్ కు సల్మాన్ ఖాన్ సినిమా లేకపోవడంతో డిస్పపాయింట్ అయ్యారు ఖాన్ ఫ్యాన్స్.  ప్రతి సంవత్సరం పండక్కి సినిమా రిలీజ్ చేసే ఆ స్టార్ హీరో ఈసారి ఈద్ ను మిస్సయ్యాడు పాపం.

కరోనా దెబ్బకి ఫెస్టివల్ ను మిస్ అయ్యాడు. ప్రతి సంవత్సరం ఈద్‌కి సందడి చేస్తుంటాడు. గత 10 సంవత్సరాల నుంచి కంటిన్యూయస్ గా రంజాన్‌కి సినిమా రిలీజ్ చేసి పండగ హడావిడిని పెంచే ఈ కండల హీరో..ఇప్పుడు కరోనాతో ఆ ఛాన్స్ మిస్ అయ్యాడు. 2009 లో రిలీజ్ అయిన ‘వాంటెడ్’ సినిమా నుంచి ఈద్ సెంటి మెంట్‌ని ఫాలో అవుతున్నాడు సల్మాన్. 

2010 లో బ్లాక్ బస్టర్ హిట్ దబాంగ్, 2011 లో బాడీ గార్డ్, 2012 లో కత్రినా కైఫ్ తో ఏక్ థా టైగర్ సినిమాలు ఈద్‌కి రలీజ్ చేశాడు సల్మాన్. మళ్లీ 2014లో సూపర్ హిట్ మూవీ కిక్, 2015 లో రికార్డులు తిరగరాసిన బజరంగీ భాయ్ జాన్, 2016లో సుల్తాన్  సినిమాలు కూడా రంజాన్ సీజన్‌లోనే విడుదల చేశాడు.

2017 ఈద్ కి ట్యూబ్ లైట్ సినిమా రిలీజ్ చేస్తే..2018 లో భారీ బడ్జెట్ మూవీ రేస్ 3 రిలీజ్ చేశాడు. 2019 లో భారత్ సినిమాని ఈద్ కే రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు సల్మాన్ ఖాన్. 2020 ఈ సంవత్సరం మే 22న ఈద్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన ‘రాధే’ సినిమాకు మాత్రం కరోనా ఎఫెక్ట్ తగిలింది. షూటింగ్స్.. థియేటర్లు బంద్ అవ్వడంతో రంజాన్ రిలీజ్ ను మిస్ అయ్యాడు సల్మాన్ ఖాన్. దాంతో ఖాన్ ఫ్యాన్స్ బాగా డిస్సపాయింట్ అయ్యారు.

దబాంగ్ 3 హిట్  తర్వాత ప్రభుదేవాతోనే ‘రాధే’ సినిమా చేస్తున్నాడు సల్మాన్. దిశా పటానీ జంటగా చేస్తున్న ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ తో తెరక్కుతోంది. ఎందుకంటే ఈ సినిమాకి సంబందించి ఇంకా రెండు పాటలతో పాటు .. ఒక వారం ప్యాచ్ వర్క్ షూటింగ్, ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే మిగిలి ఉంది.

తెలుగు రాష్ట్రాలలో పొస్ట్ ప్రొడక్షన్ కు పర్మిషన్ వచ్చినా.. బాలీవుడ్‌లో ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీపై ఎలాంటి క్లారిటీ లేదు. దాంతో షూటింగ్స్ కు థియేటర్స్‌కు పర్మిషన్ దొరకగానే ‘రాధే’ పనులు కంప్లీట్ చేసి.. వీలైతే దీపావళికి రిలిజ్ చేసే ఫ్లాన్ లో ఉన్నారు మూవీ టీమ్. సో..దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఈద్ కి సినమా రిలీజ్ చేసే తన సెంటిమెంట్ ని మిస్ అయ్యాడు సల్మాన్ ఖాన్. 

READ  మహర్షి సక్సెస్ సెలబ్రేషన్స్‌లో డియర్ కామ్రేడ్ టీమ్

Read: అందమైన ఫ్యామిలీ : సరదాగా పిల్లలతో ప్రిన్స్ మహేష్

Related Posts