ramana deekshitulu on cm jagan

మరో 30 ఏళ్లు సీఎంగా జగన్ ఉండాలి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

టీటీడీ ఆగమ సలహామండలి సభ్యుడిగా నియమితులైన రమణదీక్షితులు సీఎం జగన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో 30 ఏళ్లు జగన్ సీఎంగా ఉండాలని ఆకాంక్షించారు.

టీటీడీ ఆగమ సలహాదారుడిగా నియమితులైన రమణదీక్షితులు సీఎం జగన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో 30 ఏళ్లు జగన్ సీఎంగా ఉండాలని ఆకాంక్షించారు. సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలుపుకున్నారని ఆయన ప్రశంసించారు. టీటీడీ ఆగమ సలహాదారుడిగా తనకు అవకాశం ఇచ్చారని తెలిపారు. శ్రీవారికి కైంకర్యాలు చేసే భాగ్యాన్ని కల్పిస్తానని, అర్చకుల రిటైర్మెంట్ నిబంధనను తొలగిస్తామని సీఎం హామీ ఇచ్చారని వెల్లడించారు. ధర్మాన్ని కాపాడేందుకు జగన్ కృషి చేస్తున్నారని అభినందించారు. అర్చకులు సీఎం జగన్ కు రుణపడి ఉంటారని అన్నారు.

మాజీ సీఎం చంద్రబాబుపై రమణదీక్షితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశపారంపర్య అర్చకులను చంద్రబాబు పదవీ విరమణ చేయించారని మండిపడ్డారు. అర్చకుల పట్ల చంద్రబాబు దారుణంగా వ్యవహరించారని వాపోయారు.

బ్రాహ్మణ సముదాయానికి సీఎం జగన్ ఎంతో మేలు చేశారని, వారంతా సంతోషంగా ఉన్నారని రమణదీక్షితులు చెప్పారు. అర్చకుల వారసత్వాన్ని గౌరవించారని, అందరికి తిరిగి బాద్యతలు ఇస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. తనకే కాదు మిగిలిన ప్రధాన అర్చకులకు కూడా వారం రోజుల్లో తిరిగి అవే పోస్టులు ఇస్తామని జగన్ చెప్పారని రమణదీక్షితులు తెలిపారు. విధుల్లో చేరగానే సీఎం జగన్, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోరుతూ శ్రీవారి పాదాల దగ్గర ప్రార్దన చేస్తామన్నారు.

టీటీడీ ఆగమ సలహాదారుడిగా రమణదీక్షితులను నియమితులయ్యారు. గతంలో రమణదీక్షితులు శ్రీవారి ఆలయ ప్రధానార్చకుడిగా విధులు నిర్వర్తించారు. ఏడాదిన్నర క్రితం ఆయన శ్రీవారి ఆలయ విధులకు దూరమయ్యారు. తాజాగా సీఎం జగన్ ఆదేశంతో టీటీడీ మళ్లీ ఆయనను విధుల్లోకి తీసుకుంది. ఓవైపు ఆగమ సలహాదారుడిగా ఉంటూనే యువ అర్చకులకు శిక్షణ ఇచ్చే అదనపు బాధ్యతలను రమణదీక్షితులు నిర్వర్తించనున్నారు. వైఖానస ఆగమశాస్త్రంలో ఆయన అనుభవం, పరిజ్ఞానం ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావించింది.

Related Posts