లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Political

కడప జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ : వైసీపీలో చేరనున్న రామసుబ్బారెడ్డి, సతీష్ రెడ్డి 

కడప జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగలబోతుంది. టీడీపీకి చెందిన సీనియర్ నేతలు ఆ పార్టీని వీడనున్నారు.

Published

on

Ramasubbaraddy and Satish Reddy To resign for TDP

కడప జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగలబోతుంది. టీడీపీకి చెందిన సీనియర్ నేతలు ఆ పార్టీని వీడనున్నారు.

కడప జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగలబోతుంది. టీడీపీకి చెందిన సీనియర్ నేతలు ఆ పార్టీని వీడనున్నారు. మాజీ మంత్రి టీడీపీ నేత రామసుబ్బారెడ్డి, పులివెందుల టీడీపీ ఇంచార్జ్ సతీష్ రెడ్డి ఆ పార్టీని వీడనున్నారు. రామసుబ్బారెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. జమ్మలమడుగులో టీడీపీ కార్యకర్తలు, అభిమానులతో రామసుబ్బారెడ్డి సమావేశం అయ్యారు. పార్టీ మార్పుపై సమాలోచనలు చేస్తున్నారు. కొద్దిసేపట్లో రామసుబ్బారెడ్డి మీడియా ముందుకు రానున్నారు. (టీడీపీకి ఎమ్మెల్సీ డొక్కా గుడ్ బై.. త్వరలో వైసీపీలోకి!)

అలాగే పులివెందుల టీడీపీ ఇంచార్జ్ సతీష్ రెడ్డి కూడా ఆ పార్టీని వైసీపీలో చేరే ఛాన్స్ ఉందని సమాచారం. సతీష్ రెడ్డి కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు కరువయ్యే అవకాశం కనిపిస్తోంది. జమ్మలమడుగు రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న రామసుబ్బారెడ్డి టీడీపీని వీడుతారన్న ఊహాగానాలు మూడు రోజులుగా భారీగా వినిపిస్తున్నాయి.

ఆయన కుమారుడిని మైలవరం నియోజకవర్గం నుంచి జెడ్ పీటీసీగా పోటీ చేయించి..తర్వాత జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేయాలనే ఆలోచనలో రామసుబ్బారెడ్డి ఉన్నారని తెలుస్తోంది. వైసీపీ సలహాదారుడి సజ్జల రామకృష్ణారెడ్డితో రామసుబ్బారెడ్డి ఇప్పటికే చర్చలు జరుపుతున్నారని…చర్చలు ఓ కొలిక్కి వచ్చే దశకు చేరుకున్నాయని సమాచారం.