అమితాబ్ కు కరోనా…ప్రార్థించను అంటున్న వర్మ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్, పలువురు ప్రార్థిస్తున్నారు. కొంతమంది అయితే…ఏకంగా పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. కానీ ఎప్పుడూ వివాదం ఉండే…రాంగోపాల్ వర్మ మాత్రం అమితాబ్ కోసం ప్రార్థించను అంటున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

rgv amithabఅమితాబ్ బచ్చన్ కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారు. త్వరగా కోలుకోవాలని ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘సర్కార్.. కరోనా బ్యాక్ మీద తన్ని ఎప్పటిలాగే మీరు ఇంకా ఆరోగ్యంగా తిరిగి వస్తారని తెలుసు. అందుకే మీ కోసం ప్రార్థించను. కానీ నేను కరోనా కోసం ప్రార్థిస్తాను. ఎందుకంటే మిమ్మల్ని ఇలా చేసినందుకు అది పక్కాగా చచ్చిపోతుంది’ అని వర్మ చెప్పుకొచ్చారు.

నానావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న అమితాబ్ ఆరోగ్యం కుదుటగానే ఉందని, కొద్దిపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని ప్రస్తుతం ఐసోలేషన్ యూనిట్ లో ఉంచినట్లు వైద్యులు వెల్లడించారు. శనివారం అమితాబ్ టెస్ట్ చేయించుకున్నానని పాజిటివ్ వచ్చిందని ట్వీట్ చేశారు.

తనతో క్లోజ్ గా ఓ 10రోజుల నుంచి తిరిగిన వారంతా టెస్టు చేయించుకోవాలంటూ సూచించారు. ఐశ్వర్య, ఆరాధ్య ఇంటి దగ్గర ట్రీట్ మెంట్ తీసుకోవాలనుకుంటే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అడిషనల్ కమిషనర్ సురేశ్ కాకాని అన్నారు. జయాబచ్చన్ కు నెగెటివ్ అని తేలింది.

 

Related Posts