లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

తన ఆరోగ్యం గురించి షాకింగ్ విషయాలు చెప్పి కంటతడి పెట్టించిన రానా

Published

on

Rana Daggubati Helth Issues: పాపులర్ తెలుగు ఓటీటీ అక్కినేని సమంత హోస్ట్ గా ‘సామ్ జామ్’ అనే టాక్ షోను ఇటీవల స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రానా దగ్గుబాటి, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ షో లో పాల్గొన్నారు. సోమవారం ఈ ఎపిసోడ్ కు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు.

రానా తన ఆరోగ్యం గురించి షాకింగ్ విషయాలు చెప్పి కంటతడి పెట్టించారు.
సరదాగా సామ్ ని పంపించేశాను అంటూ సెట్లోకి అడుగుపెట్టిన రానా నవ్విస్తూనే ఏడిపించారు.

Imageవివరాళ్లోకి వెళ్తే.. ఆ మధ్య రానా కొన్నాళ్ళు అమెరికాలో ఉన్నారు. రానా కిడ్నీలు పాడవడంతో ట్రీట్‌మెంట్ కోసం అమెరికా వెళ్లారని వార్తలు వచ్చాయి. అమెరికా నుండి తిరిగి వచ్చిన తరువాత కండలు తిరిగిన దేహంతో ఫిట్‌గా ఉండే భల్లాలదేవ రానా బక్క పలచగా మారిపోవడంతో, అతని లుక్ చూసిన వారు ఆ వార్తలు నిజమే అని నమ్మారు..Rana ఇక ‘సామ్ జామ్’ ప్రోగ్రాంలో సమంత ఇదే విషయం అడిగారు. రానా స్పందించారు.. ‘‘హ్యాపీగా ముందుకు సాగుతున్న జీవితంలో.. అకస్మాత్తుగా ఒక చిన్న పాజ్ బటన్ వచ్చింది.. పుట్టినప్పటి నుంచి నాకు బీపీ ఉంది, దీనివల్ల హార్ట్ ప్రాబ్లమ్ వస్తుంది.. ‘నీ కిడ్నీలు కూడా పాడవుతాయి. స్ట్రోక్ హెమరేజ్‌కు 70 శాతం, మరణించడానికి 30 శాతం అవకాశం ఉంది’ అని డాక్టర్స్ చెప్పారు..’’ అంటూ రానా కంటతడి పెట్టుకున్నారు.వెంటనే సమంత స్పందిస్తూ.. ‘మీ చుట్టూ జనాలు రకరకాలుగా మాట్లాడుకున్నా మీరు మాత్రం ధైర్యంగా ఉన్నార’ని అన్నారు. రానా ఆరోగ్యం గురించి చెబుతున్నప్పుడు ఆడియెన్స్ సైతం కంటతడి పెట్టుకున్నారు..


మాల్దీవుల్లో చై, సామ్..


అలాగే నాగ్ అశ్విన్ ఎలక్ట్రానిక్ కార్ గురించి, రానా, మిహికాతో పరిచయం గురించి కూడా గ్లింప్స్‌లో మాట్లాడారు. రానా ఫ్యాన్స్, ప్రేక్షకులు నవంబర్ 27న స్ట్రీమింగ్ కాబోయే ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *