తెలుగు రాష్ట్రాల సీఎంలను కలవనున్న రానా దగ్గుబాటి!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి కూడా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తను ప్రేమించిన మిహికా బజాజ్‌ను పెళ్లాడబోతున్నాడు రానా. ఇటీవలే ఇరు కుటుంబాల సమక్షంలో రోకా ఫంక్షన్ జరిగింది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.
వచ్చే నెల 8వ తేదీన ఈ వివాహం జరుగనుంది. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వివాహం జరుగనుంది.

Rana Daggubati

తెలుగు, మార్వాడీ సాంప్రదాయాలలో ఈ పెళ్లి తంతు నిర్వహించనున్నారట. ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ ఈ పెళ్లికి పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించాలని సురేష్ బాబు భావిస్తున్నారట. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరినీ పెళ్లికి ఆహ్వానించాలనుకుంటున్నారని సమాచారం. త్వరలో రానా స్వయంగా ఇరు రాష్ట్రాల సీఎంలను కలిసి ఆహ్వాన పత్రికలను అందించనున్నాడని టాలీవుడ్ టాక్.

Rana Daggubati

Related Posts