జండూబామ్‌తో మర్దన చేస్తానంటూ, ఆసుపత్రిలో కరోనా బాధితురాలిపై అత్యాచారయత్నం, హైదరాబాద్‌లో దారుణం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కామాంధులు బరి తెగిస్తున్నారు. చివరికి కరోనా పేషెంట్ అనే సంగతి కూడా మర్చిపోతున్నారు. చికిత్స పొందుతున్న విషయం కూడా పట్టకుండా కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలోని ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేదిక్ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. కరోనా చికిత్స తీసుకుంటున్న యువతిపై ఆస్పత్రిలోనే అత్యాచారయత్నం జరిగింది.

ఆసుపత్రిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలు కేకలు వేయడంతో అతడు పారిపోయాడు. అర్ధరాత్రి వేళ యువతి ఉన్న గదిలోకి వెళ్లిన కామాంధుడు.. జండూబామ్‌తో మర్దన చేస్తానంటూ.. లైంగికదాడికి యత్నించినట్టు సమాచారం. దీంతో భయపడిపోయిన బాధితురాలు, కాపాడండి అంటూ కేకలు పెట్టింది. ఎలాగో కామాంధుడి బారి నుంచి తప్పించుకుంది. ఆ తర్వాత దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసింది.

అయితే ఈ విషయం బయటికి పొక్కకుండా ఆస్పత్రి సిబ్బంది జాగ్రత్త పడినట్టు సమాచారం. నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోని అధికారులు మందలింపుతో సరిపెట్టుకున్నారు. దీనిపై బాధితురాలి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాంపల్లికి చెందిన యువతి వారం రోజుల క్రితం ఆయుర్వేదిక్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.

కాగా, నిందితుడిపై గతంలోనూ లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన ఆసుపత్రిలో కలకలం రేపింది. ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో కరోనా చికిత్స చేయించుకోడానికి యువతులు, మహిళలు వణికిపోతున్నారు. ఆసుపత్రిలో భద్రత పెంచాలని మహిళా పేషెంట్లు కోరుతున్నారు.

Related Posts