లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

వైరల్ ఫోటో: Wow.. అరుదుగా కనిపించే పసుపు తాబేలు!

Published

on

Rare yellow turtle : ఈ సృష్టిలో ప్రతిదీ చూడటానికి ఒక అద్భుతంగానే కనిపిస్తుంది. కొన్ని వింత ఆకారంలో ఉండే జంతువులు, మరికొన్ని ఉండాల్సిన రంగులో కంటే ప్రత్యేక రంగులో కనిపించి కనువిందు చేస్తుంటాయి. తాజా బెంగాలో పసుపు రంగులో ఉండే తాబేలు చెరువులోంచి బయటపడిన దృశ్యం అందరినీ ఆశ్చర్యాన్నికి గురి చేసింది. ఇలా పసుపు రంగులో మెరిసిపోతున్న తాబేలు అరుదుగా కనిపిస్తుంటాయి. ఈ తాబేలుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.వివరాల్లోకి వెళ్తే… పశ్చిమ బెంగాల్ లోని బుర్ధ్వాన్ జిల్లాలో స్థానికంగా ఉన్న చెరువు నుంచి పసుపు రంగులో మెరిసిపోతున్నా తాబేలు బయటకు వచ్చింది. అక్కడ స్థానికులంతా గుంపులు గుంపులుగా వచ్చి పసుపు వర్ణంలో ఉన్న తాబేలును చూసి, ఫోటోలు తీసి తెగ వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా అలా చెరువు నుంచి బయటకు వచ్చిన తాబేలును స్థానికులు రక్షించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ (ఐఎఫ్ఎస్) దేబాషిష్ శర్మ ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు.


బీచ్ లో కనువిందు చేసిన అరుదైన ‘‘తెల్ల తాబేలు’’ పిల్ల


పసుపు వర్ణం తాబేలు అల్బినో జాతికి చెందినవి. ఇది చాలా అరుదైన జాతికి చెందినవి. ఈ తాబేలు… షెల్(చిప్ప) తో పాటు తల, ఇతర భాగాలన్ని పసుపు రంగులోనే ఉండటం విశేషం. అయితే చెరువు నుంచి బయటపడిన తాబేలు శరీరంపై కొన్ని గాయాలయ్యాయని బుర్ద్వాన్ సొసైటీ ఫర్ ఎనిమల్స్ వెల్ఫేర్ సభ్యుడు అర్నబ్ దాస్ తెలిపారు.దీంతోపాటు ఇది ఆడ తాబేలు అనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. సుమారు దీని వయసు ఏడాదిన్నర ఉంటుందని అన్నారు. ఈ తాబేలుని రక్షించి తిరిగి సురక్షిత ప్రాంతానికి పంపిస్తామని అర్నబ్ దాస్ తెలిపారు. పసుపు వర్ణం తాబేలు కనిపించటం ఈ ఏడాది ఇది రెండోది. గతంలోను ఒడిసాలో బాలాసోర్ లోనూ ఇలాంటిదే పసుపు తాబేలు కనిపించి అందరిని ఆశ్చర్యాన్నికి గురి చేసిన విషయం తెలిసిందే.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *