టైం బాగోలేదు……వరకట్నం వేధింపుల కేసులో జ్యోతిష్యురాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

శాస్త్రాలు చెప్పే బల్లి వెళ్లి కుడితి తొట్టిలో పడ్డట్టైంది ఓ జ్యోతిష్యురాలి పరిస్ధితి. వివిధ కష్టాలతో తనను సంప్రదించే క్లయింట్లకు రెమిడీలు చెప్పి జపాలు పూజలు చేయించే జ్యోతిష్యురాలు కు ఇప్పడు టైం బాగోలేదు. తమిళనాడులోని  కోయంబత్తూరుకు చెందిన ప్రముఖ జ్యోతిష్యురాలు రాశికాల్ కల్పన ఇప్పుడు వరకట్న వేధింపులు కేసులో ఇరుక్కున్నారు.

కోయంబత్తూరులోని సెల్వపురంలో రాశికాల్  కల్పన పంచరత్న అనే రత్నాలు అమ్మే షాపు నిర్వహిస్తున్నారు. వివిధ గ్రహదోషాలతో తన వద్దకు వచ్చే వారికి జాతకం పరిశీలించి వారికి అదృష్ట రత్నాన్ని చెపుతూ ఉంటారు. ఈమె వద్దకు వచ్చే వారిలో ప్రముఖులు చాలా మందే ఉన్నారు.


కల్పనకు శ్రీకాంత్ అనే కుమారుడు ఉన్నాడు. అతనికి రెండేళ్ల క్రితం చెన్నెలో వెండి వ్యాపారం చేసే వ్యక్తి కుమార్తె అన్నపూర్ణతో వివాహం జరిపించింది. వివాహా సమయంలో అన్నపూర్ణ తల్లితండ్రులు 2కిలోల బంగారం, 68 క్యారెట్ల వజ్రాలు, కొంత నగదు కట్నంగా ఇచ్చారు. పెళ్లైన మొదటి రాత్రి గదిలో భార్యా భర్తల మధ్య గొడవ జరిగిందని తెలిసింది. అప్పటినుంచి ఇద్దరి మధ్య సఖ్యత కొరవడింది.

ఈ క్రమంలో పెళ్లైన మూడు నెలల్లోనే కోడలిని పుట్టింటికి పంపించిది కల్పన. అన్నపూర్ణకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని కల్పన వియ్యాల వారికి చెప్పింది. మీ అమ్మాయికి డయాబెటిస్ ఉందని ఆమె మానసికి పరిస్ధితికూడా సరిగా లేదని కల్పన ఆరోపించారు. చిన్న చిన్న శబ్దాలకు కూడా అన్నపూర్ణ భయపడుతుందని కల్పన ఫిర్యాదు చేసింది.


అన్నపూర్ణ తన అత్త కల్పన  మీద గతేడాది ఆర్ఎస్ పురం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కల్పనకు ఉన్న రాజకీయ పలుకుబడి, జ్యోతిష్యురాలుగా ఆమెకు ఉన్న పరిచయాలతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో అన్నపూర్ణ ఇటీవల కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. కోర్టు కల్పనపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

ఈ ఘటనపై కొందరు కోయంబత్తూరులో పోస్టర్లు అంటించటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గత రెండేళ్లుగా ఈ వివాదం నడుస్తున్నప్పటికీ విషయం లీక్ కాకుండా కల్పన జాగ్రత్తపడ్డారు. అందరికీ మంచి రోజులు గురించి చెప్పే రాశికాల్ కల్పన ఈ గండం నుంచి ఎలా బయటపడతారా అని వ్యాఖ్యానిస్తున్నారు.


కాగా రాశికాల్ కల్పన ఒక ఛానల్లో మాట్లాడుతూ ….మేము ఆమె జాతకం చూసిన తర్వాతే నా కొడుకుతో పెళ్లి చేసుకున్నాము. జాతకం కూడా బాగుంది. అమ్మాయి జాతకంలో తప్పడు వివరాలు ఇచ్చి ఉండవచ్చు… అన్నపూర్ణకు అనేక వ్యాధులు ఉన్నాయి. అందుకే మేము వద్దని చెప్పాము. విడాకుల కేసు పెండింగ్‌లో ఉంది. వరకట్నం కోసం వేధించామనేది పూర్తిగా అబద్ధం, ”అని అన్నారు.

READ  మోడీ-జిన్ పింగ్ పర్యటన తర్వాత...మహాబలిపురానికి క్యూ కడుతున్న టూరిస్టులు

Related Posts