Ravi Babu’s Aaviri Movie Review

ఆవిరి – రివ్యూ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఒకప్పుడు కామెడీ బేస్ మూవీస్‌ను వరుసబెట్టి తెరకెక్కించిన రవిబాబు ఓటైమ్ నుండి హారర్ బ్యాగ్రౌండ్ మూవీస్‌నే తీస్తున్నాడు.. ‘అవును’ సిరీస్‌లో 2 సినిమాల చేసిన తరువాత  ఓ పందిని లీడ్ రోల్‌లో పెట్టి ‘అదుగో’ అనే సినిమా చేసి ఆకట్టుకోలేకపోయిన రవిబాబు.. తానే స్వయంగా ఫుల్ లెంగ్త్ పాత్రలో కనిపిస్తూ.. డైరెక్ట్ చేసిన హారర్ జానర్ సినిమా ‘ఆవిరి’తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.. మరి ఈ సినిమా ఆడియన్స్‌ను ఎంత వరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం.. 

కథ : 
రాజ్‌కుమార్‌ ‌రావు, తన భార్య లీనా తమ కూతుర్లు శ్రేయ,మున్నిలతో హ్యాపీగా లైఫ్‌ను లీడ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఓ ప్రమాదంలో పెద్ద కూతురు శ్రేయ చనిపోతుంది.దాంతో ఆ ఇంట్లో ఉంటే శ్రేయనే గుర్తుకు వస్తుందని.. ఒక పాత పెద్ద బంగ్లాలోకి ఫ్యామిలీ షిఫ్ట్ అవుతారు.అయితే కొత్త ఇంట్లో చిన్న కూతురు మున్ని విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది.. తనతో దెయ్యం మాట్లాడుతుంది అన్నట్టు బిహేవ్ చేస్తుంది. చివరికి ఆ దెయ్యం సాయంతో ఇల్లు వదిలిపోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అసలు మున్ని ఎందుకు ఇల్లు వదిలి వెళ్లిపోవాలనుకుంది ?మున్నితో మాట్లాడుతున్న ఆ దెయ్యం ఎవరు ? ఆ దెయ్యానికీ రాజ్ కుమార్‌కీ సంబంధం ఏమిటి ? ఆ దెయ్యం దేని కోసం రాజ్ కుమార్ ఫ్యామిలీని టార్గెట్ చేసింది? దెయ్యం విషయంలో రాజ్ కుమార్, లీనాలు ఏం చేశారు..? లాంటి విషయాలు  తెరపై చూడాల్సిందే..

Read Also : మీకు మాత్రమే చెప్తా – రివ్యూ..

నటీనటులు :
తనకు అలవాటైన ఎక్స్‌ప్రెషన్స్‌తో రవిబాబు చాలా ఈజీగా నటించేశాడు. అప్పుడప్పుడు ఒకటి రెండు చోట్ల కామెడీ పండించడానికి కూడా ట్రై చేశాడు. అయితే సినిమా మొత్తం సీరియస్ లుక్‌లోనే కనిపించాడు రవిబాబు. ఇక లీనా పాత్రలో నటించిన నెేహా చౌహాన్ ఫస్ట్ హాఫ్‌లో పర్వాలేదు అనిపించినా.. దెయ్యం పట్టిన పాత్రలో మాత్రం ఒకే ఎక్స్ ప్రెషన్‌తో విసుగు పుట్టించింది. శ్రీముక్తా మాత్రం తన పాత్రకు తగ్గట్టు నటించింది. రవిబాబు సినిమా అంటేనే తక్కువ పాత్రల సినిమా. ఆయన మార్క్ తో అతి తక్కువ క్యారెక్టర్స్‌తో తెరకెక్కించిన ఆవిరి లో అందరూ బాగానే నటించారు.. రాజ్, లీనా, మున్నీల చుట్టే కథ తిరిగినా.. అప్పుడప్పుడూ వచ్చే పోలీస్ పాత్ర.. డాక్టర్ జాన్వీ పాత్రలు బాగా ఆకట్టుకుంటాయి.. బిగ్ బాస్‌‌తో ఫేమస్ అయిన హిమజ కమల పాత్రలో తక్కువ నిడివి ఉన్న పాత్ర చేసినా.. తనదైన శైలిలో అలరిస్తుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిది మేర బాగా నటించారు.

READ  అక్టోబర్ 18న ‘ఆవిరి’

టెక్నీషియన్స్ :

తనకంటూ ప్రత్యేక శైలి ఏర్పచుకున్న రవిబాబు నుండి ఇలాంటి సినిమాని ఆశించలేం. ‘ఆవిరి’లో మెయిన్ థీమ్‌‌తో పాటు కొన్ని హారర్ సీన్స్ ఆకట్టుకున్నప్పటికీ.. సినిమా మాత్రం బాగా స్లోగా సాగుతూ బోర్ కొడుతోంది. పైగా చాలా భాగం  రొటీన్‌ హారర్ తంతు వ్యవహారంతోనే సినిమా సాగడంతో ఆవిరి తేలిపోయింది. కెమెరామెన్ కెమెరా పనితనం హారర్ సన్నివేశాల్లో బాగుంది. సంగీత దర్శకుడు అందించిన సంగీతం ఆకట్టుకోలేకపోయినా.. హారర్ బ్యాగ్రౌండ్ సినిమా కావడంతో సందర్భానుసారం వినిపించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కొంచెం భయపెడుతుంది. ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన దర్శకుడు ఏది చెబితే అది కట్ చేసుకుంటూ వెళ్ళిన్నట్టు అనిపిస్తోంది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు..
 
ఓవరాల్‌గా చెప్పాలంటే :

 హారర్, థ్రిల్లర్ లాంటి జానర్లను ఓ సెక్షన్ ఆడియన్స్‌ మాత్రమే చూస్తారు. వేరే జానర్ ఆడియన్స్ చూడాలంటే అందులో కొత్తదనం ఉండాలి.. ఎప్పుడో చూసిన కథ, కథనాలతో మళ్లీ కొన్ని మార్పులు చేసి చూపిస్తే వారిని ఆకట్టుకోవడం కాస్త కష్టమే. కొత్తదనం కరువైన ఆవిరి సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించడం కష్టమనే చెప్పాలి. 
 

Related Posts