లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Sports

తీవ్ర గాయంతో ఆస్ట్రేలియా టూర్ నుంచి వెనుదిరగనున్న రవీంద్ర జడేజా

Published

on

Ravindra Jadeja: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా ప్లేయర్ మరొకరికి తీవ్ర గాయమైంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు బొటనవేలికి గాయం కావడంతో విలవిలలాడిపోయాడు. ఇండియన్ సపోర్టింగ్ స్టాఫ్ గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు భావించి స్కానింగ్ చేశారు.

పాట్ కమిన్స్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ మోకాలికి గాయం కావడంతో ఆస్ట్రేలియాతో సెకండ్ ఇన్నింగ్స్ లో ఫీల్డింగ్ కు రాలేకపోయాడు. మ్యాచ్ జరుగుతున్న 99వ ఓవర్లో ఇండియన్ ఇన్నింగ్స్ కు మిచెల్ స్టార్క్ కొట్టిన బంతి జడేజా గ్లౌజుల్లో నుంచి గట్టిగా తగిలింది. వెంటనే ఫిజియోల దృష్టికి వెళ్లగా ఫస్ట్ ఎయిడ్ చేశారు.

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ విసిరిన బౌన్సర్ బంతిని ఫుల్ చేసేందుకు రిషబ్ పంత్ (36) ప్రయత్నించగా.. అతని బ్యాట్‌కి దొరకని బంతి వేగంగా వెళ్లి అతని మోచేతి భాగాన్ని తాకింది. ఫిజియో సాయం తీసుకున్న పంత్ అలానే బ్యాటింగ్‌ని కొనసాగించాడు.

రిషబ్ పంత్ గాయం తీవ్రత ఎక్కువగా లేదని.. ఒకవేళ జట్టుకి అవసరమైతే మ్యాచ్‌లో ఐదో రోజైన సోమవారం అతను బ్యాటింగ్‌ కోసం వెళ్తాడని బీసీసీఐ అధికారి వెల్లడించారు. రవీంద్ర జడేజా గాయం తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉండటంతో ఎడమచేతి బొటన వేలు విరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అలా జరిగితే మాత్రం జడేజా సిరీస్ నుంచి తప్పుకున్నట్లే.