RBI Grade-B Officer Recruitment Result Has Released

RBI గ్రేడ్-బీ ఆఫీసర్స్ ఫలితాలు విడుదల

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

RBI గ్రేడ్-బీ ఆఫీసర్స్ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. గ్రూప్-బి పరిధిలోని జనరల్ (DR-డైరెక్ట్ రిక్రూట్), (DEPR) డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ పాలిసీ అండ్ రిసెర్చ్, (DSIM) డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పోస్టుల వారీగా విడుదల చేశారు. జోన్లవారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో PDF రూపంలో అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల మార్కుల షీట్స్, కటాఫ్ మార్కుల వివరాలను 15 రోజుల్లో విడుదల చేయనున్నారు.  

(RBI) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతేడాది జులై నెలలో 166 గ్రేడ్-బి ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో జనరల్ కేటగిరీ పోస్టులు 127 ఉండగా, 22 (DEPR) పోస్టులు, 17 (DSIM) పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టులో ఫేజ్-1 పరీక్ష, సెప్టెంబరులో ఫేజ్-2 పరీక్షలు నిర్వహించింది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేసింది.  

* ఫలితాల కోసం కింది లింక్‌లను క్లిక్ చేయండి..
గ్రేడ్-బి ఆఫీసర్స్ జనరల్ (DR) 
గ్రేడ్-బి ఆఫీసర్స్ DEPR (DR) 
గ్రేడ్-బి ఆఫీసర్స్ DSIM (DR)

Related Posts

Trending

Latest News