RBI Removes Neft Payment Charges

గుడ్ న్యూస్ : నెఫ్ట్ లావాదేవీలు ఫ్రీ 

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్) లావాదేవీలకు ఛార్జీలు 2020 నుంచి రద్దు చేయాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయించింది. సేవింగ్స్ ఖాతాదారులు చేసే లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. డిజిటల్ లావదేవీలను ప్రోత్సాహించే ఉద్దేశ్యంతో ఆర్‌బీఐ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. దేశ పౌరులకు అసాధారణ చెల్లింపుల అనుభవాన్ని కల్పించేందుకు సేవింగ్స్ బ్యాంకు నుంచి ఖాతాదారుల నుంచి నెప్ట్ ఛార్జీలు వసూలు చేయరాదని నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. 2020 జనవరి నుంచి  వసూలు చేయరాదని బ్యాంకులను ఆదేశిస్తున్నాం అని ఆర్బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.

డిజటల్ / కార్డు చెల్లింపులకు అవసరమైన మౌలిక వసతుల కోసం యాక్సెప్టెన్స్ డెవలప్ మెంట్ ఫండ్‌ను 2020 జనవరి 01 నుంచి అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకుంది. డీమానిటైజేషన్ జరిగి మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి రూ. 10 వేలు విలువ వరకు నెఫ్ట్ లావాదేవీలపై రూ. 2 ఛార్జీని, అదనంగా జీఎస్టీని బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. రూ. 2 లక్షల పైన జరిపే లావాదేవీలపై ఎస్‌బీఐ రూ. 20 ఛార్జీని, దీనిపై జీఎస్టీని వసూలు చేస్తోంది. 

2018 అక్టోబర్ నుంచి 2019 సెప్టెంబర్ వరకు జరిగిన నగదు రహిత రిటైల్ చెల్లింపుల్లో 96 శాతం డిజిటల్‌వే ఉన్నాయి. ఈ ఏడాది కాలంలో నెఫ్ట్ ద్వారా రూ. 252 కోట్ల లావాదేవీలు, యూపీఐ ద్వారా రూ. 874 కోట్ల లావాదేవీలు జరిగాయి. బ్యాంకుల మధ్య ఆన్ లైన్ లావాదేవీలకు సంబంధించి నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ అనే రెండు ముఖ్య విధానాలు అమల్లో ఉన్నాయి. ఈ రెండు వ్యవస్థలను ఆర్బీఐ నిర్వహిస్తుంది. 
Read More : అయోధ్యపై నిర్ణయమేదైనా..సయోధ్యను విస్మరించరాదు – మోడీ ట్వీట్

Related Posts