RBI Stops Printing New Rs 2,000 Notes

మళ్లీ ఏమైనా మూడిందా : రూ.2వేల నోట్ల ముద్రణ నిలిపివేత

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఢిల్లీ: కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. 2వేల రూపాయల నోట్ల ప్రింటింగ్‌ను ఆపేసింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మనీలాండరింగ్‌ను తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ట్యాక్స్ ఎగ్గొట్టడానికి, అక్రమ ఆస్తులు దాచుకునేందుకు రూ.2వేల నోట్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీనిని ఆరికట్టేందుకు 2వేల రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేసినట్టు సమాచారం. ఇప్పటివరకు మొత్తం 18.03లక్షల కోట్ల రూపాయల కరెన్సీ చెలామణీలో ఉండగా అందులో 37శాతం (6.73లక్షల కోట్లు) 2వేల రూపాయల నోట్లు ఉన్నాయి. 43 శాతం 500 రూపాయల నోట్లు ఉన్నాయి.
కారణం అదేనా:
దేశంలో బ్లాక్ మనీకి చెక్ పెట్టేందుకు 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రధాని మోదీ తీసుకున్నారు. 1000, 500 రూపాయల నోట్లను రద్దు చేశారు. నోట్ల కష్టాలకు పరిష్కారంగా వాటి ప్లేస్‌లో 2వేల రూపాయల నోటును తీసుకొచ్చారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ నాడు తీసుకున్న నిర్ణయం దేశంలో సంచలనం అయ్యింది. పెద్ద నోట్లను రద్దు చేసి వాటి ప్లేస్‌లో 2వేల రూపాయల నోటును తీసుకురావడం వివాదానికి దారితీసింది. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
అక్రమార్కులకు వరంగా రూ.2వేల నోటు:
బ్లాక్ మనీ దాచుకునే వారికి ఈ నోటు మరింతగా యూజ్ అవుతుందని ప్రతిపక్ష నాయకులు మండిపడ్డారు. వారి ఆరోపణలే నిజమయ్యాయి. అక్రమార్కులకు 2వేల రూపాయల నోటు వరంగా మారింది. దీంతో మోదీ ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది. 2వేల రూపాయల నోట్ల ప్రింటింగ్‌ను ఆపేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది. మళ్లీ ఏమైనా మూడిందా అని ప్రజలు టెన్షన్ పడుతున్నారు. కొంతకాలంగా 2వేల రూపాయల నోట్లను కేంద్రం విత్ డ్రా చేసుకుంటందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. చివరికి అది నిజమే అయ్యింది. రూ.2వేల నోట్ల ప్రింటింగ్ నిలిపివేసినా.. అవి మార్కెట్‌లో చెలామణి అవుతాయని ఆర్బీఐ తెలిపింది.

Related Posts