లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Health

తెలంగాణలో వ్యాక్సిన్ పంపిణీకి సర్వం సిద్ధం

Published

on

Telangana Ready for Covid-19 Vaccination : కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం తెలంగాణ సిద్ధమైంది. నేడు రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్ డోసులు రాబోతున్నాయి. మొదట దశలో హెల్త్ కేర్ వర్కర్లకు టీకా ఇవ్వనుంది ఆరోగ్య శాఖ. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 139 సెంటర్లలో వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు అధికారులు. దేశ‌వ్యాప్తంగా క‌రోనా వాక్సిన్ పంపిణీ కోసం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీంతో తెలంగాణకు వాక్సిన్ డోసులు రానున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యింది. జిల్లాల్లో కోల్డ్ స్టోరేజీల్లో భ‌ద్రప‌రిచేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇప్పటికే కోఠిలోని కోల్డ్ స్టోరేజీతో పాటు రాష్ట్రంలో మొత్తం 866 కోల్డ్ స్టోరేజీల‌ను సిద్ధం చేసింది.

రాష్ట్రానికి మొత్తం 6 లక్షల 50 వేల వాక్సిన్ డోసులు రాబోతున్నాయి. ఈ నెల 16 నుంచి వాక్సిన్ ఇచ్చేందుకు 139 సెంటర్లను ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ సంద‌‌ర్భంగా ప్రధాని మోదీ వాక్సిన్ తీసుకునే వైద్య సిబ్బందితో వ‌ర్చువ‌ల్‌గా మాట్లాడ‌బోతున్నారు. అందుకు రాష్ట్రంలోని గాంధీ, నార్సింగ్ వాక్సిన్ సెంటర్లను ఎంచుకున్నారు. మిగతా సెంటర్లలో ప్రధాని స్పీచ్ వినేందుకు ఏర్పాట్లు చేస్తోంది వైద్యారోగ్య శాఖ‌. రాష్ట్రంలో మొత్తం వ్యాక్సిన్ లబ్ధిదారులు 2 లక్షల 98వేల 424మంది ఉన్నారు. స్టేట్ వ్యాక్సిన్ స్టోర్ లో తగినంత నిల్వ సామర్ధ్యం ఉంద‌ని అధికారులు చెబుతున్నారు. మొత్తం పది TSMSIDC స్టోరేజీ సెంట‌ర్లో టీకాలు ఉంచడానికి ఏర్పాట్లు చేశారు. PHC లో 866 కోల్డ్ చైన్ పాయింట్లు ఉన్నాయి.

టీకాలు ఇవ్వడానికి 1,213 సైట్లు గుర్తించారు. మొదటి దశలో హెల్త్‌, ఫ్రంట్‌లైన్ వర్కర్లతో పాటు 50 సంవత్సరాలు దాటిన వారికి టీకా ఇవ్వనున్నారు. వాక్సిన్ ఇచ్చిన తరువాత వచ్చే స‌మ‌స్యలను ఎదుర్కొనేందుకు ఆయా కిట్లు వాక్సినేషన్ సైట్స్‌లో అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలో మొత్తం 9,720 వ్యాక్సినేటర్స్‌ని గుర్తించారు. ప్రతి వ్యాక్సినేటర్ రోజుకి 100 వాక్సిన్‌లు ఇస్తారు. ఇప్పటివ‌ర‌కు 2 ల‌క్షల 89వేల 424 మంది హెల్త్‌ వ‌ర్కర్లు వాక్సినేష‌న్‌కి న‌మోదు చేసుకున్నారు. డ్రై ర‌న్‌లో 20వేల‌కు పైగా ల‌బ్దిదారులు పాల్గొన్నారు.

మెడిక‌ల్ ఆఫీస‌ర్స్, ANM లు, ఇత‌ర సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తయింది. రొటీన్ ఇమ్యునైజేషన్‌కు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పుణెలోని సీరం సంస్థ నుంచి కొవిషీల్డ్‌ టీకా తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు తెల్లవారుజామున కట్టుదిట్టమైన భద్రత మధ్య వ్యాక్సిన్ రవాణా ప్రారంభించారు. ఇందు కోసం జీపీఎస్‌ సౌకర్యమున్న ట్రక్కులను వినియోగిస్తున్నారు. 300 ట్రక్కుల్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ సంస్థ నుంచి బయలుదేరింది.

దేశవ్యాప్తంగా ఉన్న 60 కన్‌సైనీ కేంద్రాలకు చేరవేస్తారు. అక్కడి నుంచి వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు తరలిస్తారు. సంస్థ నుంచి ట్రక్కులు బయటకు వచ్చే ముందు కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఇటు తెలంగాణకు వాక్సిన్ డోసులు రానున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యింది. జిల్లాల్లో కోల్డ్ స్టోరేజీల్లో భ‌ద్రప‌రిచేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కోఠిలోని కోల్డ్ స్టోరేజీతో పాటు రాష్ట్రంలో మొత్తం 866 కోల్డ్ స్టోరేజీల‌ను సిద్ధం చేసింది.

రాష్ట్రానికి మొత్తం 6 లక్షల 50 వేల వాక్సిన్ డోసులు రాబోతున్నాయి. ఈ నెల 16 నుంచి వాక్సిన్ ఇచ్చేందుకు 139 సెంటర్లను ఏర్పాటు చేయగా.. తొలి దశలో రాష్ట్రంలో మొత్తం వ్యాక్సిన్ లబ్ధిదారులు 2 లక్షల 98వేల 424మంది ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 9 వేల 720 వ్యాక్సినేటర్స్‌ని గుర్తించారు. ప్రతి వ్యాక్సినేటర్ రోజుకి 100 వాక్సిన్‌లు ఇవ్వనున్నారు. ఇప్పటివ‌ర‌కు 2 ల‌క్షల 89వేల 424 మంది హెల్త్‌ వ‌ర్కర్లు వాక్సినేష‌న్‌కి న‌మోదు చేసుకున్నారు. డ్రై ర‌న్‌లో 20వేల‌కు పైగా ల‌బ్దిదారులు పాల్గొన్నారు. మెడిక‌ల్ ఆఫీస‌ర్స్, ANM లు, ఇత‌ర సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తయింది. రొటీన్ ఇమ్యునైజేషన్‌కు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *