Movies
అలాంటివి మనవల్ల కాదు.. అవి అడుగుతున్నారనే సినిమాలు మానేశా..
యాంకర్ శ్రీముఖి తాను సినిమాలు కంటిన్యూ చేయకపోవడానికి కారణం ఏంటో చెప్పింది..
Home » అలాంటివి మనవల్ల కాదు.. అవి అడుగుతున్నారనే సినిమాలు మానేశా..
యాంకర్ శ్రీముఖి తాను సినిమాలు కంటిన్యూ చేయకపోవడానికి కారణం ఏంటో చెప్పింది..
Published
10 months agoon
By
sekharయాంకర్ శ్రీముఖి తాను సినిమాలు కంటిన్యూ చేయకపోవడానికి కారణం ఏంటో చెప్పింది..
బుల్లితెర పాపులర్ యాంకర్ శ్రీముఖి సినిమాలు ఎందుకు చేయడంలేదు. టీవీ ద్వారా వచ్చిన పాపులారిటీని ఉపయోగించుకుని సినిమాలలో సత్తా చాటకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ షోలకే ఎందుకు పరిమితమైపోయింది?.. ‘బిగ్ బాస్3’లో రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి కథానాయిక కావాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ‘జులాయి’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘నేను శైలజ’, ‘జెంటిల్ మెన్’, ‘బాబు బాగా బిజీ’ వంటి సినిమాల్లో క్యారెక్టర్లు చేసినా శ్రీముఖి నటిగా ఎందుకు కొనసాగడం లేదు అని చాలామంది అడుగుతున్న ప్రశ్నలకు.. తాజాగా ఆలీ హోస్ట్ చేస్తున్న కార్యక్రమంలో సమాధానమిచ్చింది.
‘‘జులాయి సినిమాలో చేస్తున్నప్పుడే నాన్నగారు సినిమాలు చేయవద్దని గట్టిగా చెప్పారు. ఆ సినిమానే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ చిత్రం అవ్వాలని ఆర్డర్ వేశారు. అయినా ఆ తర్వాత హీరోయిన్గా అవకాశాలు వచ్చిన రెండు మూడు సినిమాలు చేశాను. ఆ తర్వాత పూర్తిగా మానేశాను. ఆ తర్వాత టీవీ షోలు చేయడం మొదలుపెట్టాను. ఆ టైమ్‌లో త్రివిక్రమ్‌గారు నువ్వు ఎక్కువగా టీవీ షోలు చేస్తుంటే సినిమా అవకాశాలు రావని చెప్పారు. ఆయన అన్నట్లుగానే జరిగింది.
Read Also : పోలీస్ బిడ్డగా వారందరికీ చేతులెత్తి సెల్యూట్ చేస్తున్నాను..
అయితే నేను టీవీ షోలు స్టార్ట్ చేసినప్పుడు రెండు, మూడు సినిమా కథలు నా దగ్గరకి వచ్చాయి. చిన్న సినిమాలే అయినా వాటిలో నా పాత్రకు తగిన ప్రాముఖ్యత లేకపోవడం, అలాగే ఎక్స్పోజింగ్, లిప్‌లాక్‌లు చేయాలని అడగడంతో.. అవి నావల్ల కాదనుకుని సినిమాలకు గుడ్ బై చెప్పాను. టీవీ షోలలో బిజీ అవ్వడంతో ఆ తర్వాత సినిమాల గురించి పట్టించుకునేంత టైమ్ కూడా రాలేదు..’’ అని శ్రీముఖి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బుల్లితెరపై ఆమె స్టార్డమ్ ఏ రేంజ్లో ఉందో చెప్పక్కర్లేదు.