లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Hyderabad

రాహుల్ సిప్లిగంజ్‌ని రౌండప్ చేసి రక్తం కారేలా కొట్టారు, పాత గొడవలతో పక్కా పథకం ప్రకారమే దాడి?

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజమ్(PRISM) పబ్‌లో బిగ్ బాస్ విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై బీరు సీసాలతో దాడి సంచలనం రేపుతోంది. బుధవారం(మార్చి 4,2020)

Published

on

Reason behind attack on rahul sipligunj in prism pub

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజమ్(PRISM) పబ్‌లో బిగ్ బాస్ విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై బీరు సీసాలతో దాడి సంచలనం రేపుతోంది. బుధవారం(మార్చి 4,2020)

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజమ్(PRISM) పబ్‌లో బిగ్ బాస్ విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై బీరు సీసాలతో దాడి సంచలనం రేపుతోంది. బుధవారం(మార్చి 4,2020) అర్థరాత్రి పబ్ లో గొడవ జరిగింది. రాహుల్ సిప్లిగంజ్, యువకుల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఏడుగురు యువకులు రాహుల్ ను రౌండప్ చేసి కొట్టారు. రాహుల్ బట్టలు చించేశారు. మెడపై చేతులు వేసి మరీ కొట్టారు. ఓ వ్యక్తి ఏకంగా బీరు సీసాతో రాహుల్ తలపై కొట్టాడు. ఈ దాడిలో రాహుల్ తలకు, ముక్కుకి గాయాలు అయ్యాయి. రక్తస్రావమైంది. పోలీసులు సకాలంలో స్పందించడంతో గొడవ సద్దుమణిగింది. ఆ తర్వాత గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో రాహుల్ చికిత్స తీసుకున్నాడు. అయితే దీనిపై రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాహుల్ పై దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

దాడి చేసింది ఎమ్మెల్యే సోదరుడు రితేష్ రెడ్డి:
రాహుల్ పై దాడి చేసిన వ్యక్తిని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి, అతడి స్నేహితులుగా పోలీసులు గుర్తించారు. బీరు సీసాతో రాహుల్ పై దాడి చేసింది రితేష్ రెడ్డి. కాగా, అసలేం జరిగింది? ఇద్దరి మధ్య గొడవకు కారణం ఏంటి? అసలు తప్పు ఎవరిది? అనేది మిస్టరీగా మారింది. ఈ గొడవపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడం ఆసక్తికరంగా మారింది. దీంతో పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. 

పాత గొడవలే కారణమా?
ఈ గొడవకు సంబంధించి ఎవరి వర్సన్ వారు వినిపిస్తున్నాయి. రాహుల్ తో వచ్చిన అమ్మాయిని యువకులు వేధించారని, వారిని నిలదీయడంతో రాహుల్ పై దాడి చేశారని రాహుల్ ఫ్రెండ్స్ చెబుతున్నారు. రితేష్ రెడ్డి స్నేహితుల వర్షన్ మరోలా ఉంది. రాహులే తమను వేధించాడని, ప్రతిఘటించడంతో ఘర్షణ జరిగిందని చెబుతున్నారు. కాగా, ఈ వ్యవహారానికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రితేష్ రెడ్డి, రాహుల్ ఇద్దరూ ఫ్రెండ్స్. ఒకరికొకరు తెలుసు. అయితే ఓ అమ్మాయితో పాటు ఓ ఈవెంట్ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. దాన్ని మనసులో పెట్టుకున్న రితేష్ రెడ్డి.. ఇప్పుడీ దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు రాహుల్ ఫ్రెండ్స్.

పక్కా పథకం ప్రకారమే రాహుల్ పై దాడి:
పబ్ లో జరిగిన గొడవ చూస్తుంటే.. రితేష్ రెడ్డి పక్కా పథకం ప్రకారమే దాడి చేశాడని రాహుల్ స్నేహితులు ఆరోపిస్తున్నారు. రాహుల్ పబ్ కి వచ్చిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోదరుడు రితేష్ రెడ్డి తన స్నేహితులతో పబ్ కి వచ్చాడని, కావాలనే రాహుల్ పై దాడి చేశాడని చెబుతున్నారు. అమ్మాయి, ఈవెంట్ విషయంలో జరిగిన గొడవను గుర్తుంచుకుని దాడికి పాల్పడ్డట్టు అంటున్నారు. రితేష్ రెడ్డి అతడి స్నేహితులు రాహుల్ ను తీవ్రంగా కొట్టారు. అందరూ రౌండప్ చేసి, మెడపై చేతులు వేసి, బట్టలు చించి మరీ కొట్టారు.

తల పట్టుకున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి:
ఈ వ్యవహారంతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తల పట్టుకున్నారు. దీనిపై ఆయన స్పందించారు. ఆ గొడవతో తన సోదరుడికి ఎలాంటి సంబంధం లేదని, అసలు ఆ సమయంలో తన సోదరుడు అక్కడ లేనే లేడని ఆయన వాదిస్తున్నారు. పబ్ లో తన బంధువులు ఉన్న మాట వాస్తవమే అన్న రోహిత్ రెడ్డి.. తన సోదరుడు మాత్రం అక్కడ లేదని చెబుతున్నారు. విజువల్స్ లో రితేష్ రెడ్డి క్లియర్ గా కనిపిస్తున్నా.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అలా చెప్పడం అందరిని విస్మయానికి గురి చేసింది.(బీరు బాటిళ్లతో దాడి ఘటనపై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్)

అసలు తప్పు ఎవరిది..?
దీనిపై గచ్చిబౌలి పోలీసులు స్పందించారు. ఎమ్మెల్యే సోదరుడు రితేష్ రెడ్డి అతడి స్నేహితులు గొడవలో ఉన్నారని తెలిపారు. ఆ సమయంలో ఏడు మంది అక్కడ ఉన్నారని చెప్పారు. వారందరిని ఐడెంటిఫై చేసి, చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే.. గొడవకు కారణం అమ్మాయి వ్యవహారం కాదన్నారు. రాహుల్ సిప్లిగంజ్ వెళ్తున్న క్రమంలో చేయి తాకిందని, ఆ విషయంలోనే మాటామాట జరిగి గొడవకు దారితీసిందని అంటున్నారు. రెండు వర్గాలు వేర్వేరుగా వర్షన్లు వినిపిస్తున్నాయని, అసలేం జరిగింది? తప్పు ఎవరిది? గొడవకు, దాడికి కారణం ఏంటి? అనేది తెలుసుకుంటామన్నారు. దీనిపై రాహుల్ సిప్లిగంజ్ వివరణ తీసుకుంటామన్నారు.

రౌండప్ చేసి రాహుల్ పై దాడి:
రాహుల్ సిప్లిగంజ్ బుధవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో తన ఇద్దరు స్నేహితులతో కలిసి గచ్చిబౌలిలోని ప్రిజమ్(PRISM) పబ్ కి వెళ్లాడు. వారిలో ఒక అమ్మాయి కూడా ఉంది. అప్పటివరకు పబ్ లో అంతా సందడి వాతావరణం ఉంది. రాహుల్ తన పాటలతో హోరెత్తించాడు. పాటల తర్వాత అందరితో కలిసిపోయాడు. ఆ సందడికి తగ్గట్టు స్టెప్పులు వేశాడు. ఇలా పబ్ లో కాసేపు సందడి నడిచంది. అర్థరాత్రి 1.30 వరకు అంతా బానే ఉంది. ఇంతలో ఏం జరిగిందో కానీ.. యువకులకు, రాహుల్ కు మధ్య వివాదం మొదలైంది. రితేష్ రెడ్డి అతడి స్నేహితులకు, రాహుల్ కు నచ్చ చెప్పేందుకు పబ్ లో ఉన్న ఇతరులు చాలాసేపు ప్రయత్నించారు. ఇంతలో వివాదం ముదిరి కొట్టుకునే వరకు వెళ్లింది. ఏడుగురు వ్యక్తులు రాహుల్ ని రౌండప్ చేసి కొట్టారు.