లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

రాధే శ్యామ్ షూటింగ్ : రాజసంగా ప్రభాస్

Published

on

Pan India Film Radhe Shyam : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది. ఇటలీలో జరుగుతున్న షూటింగ్ లో ప్రభాస్..ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. యాంగ్రీ లుక్ లో కనిపిస్తున్న ప్రభాస్ ను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.తాజాగా..కారు పక్కన రాజసంగా ఉన్న ప్రభాస్ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్యాన్ ఇండియన్ స్థాయిలో రూపొందుతోంది. ప్రభాస్ జన్మదినం రోజున…విక్రమాదిత్య లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్, పూజా హెగ్డేలకు మోషన్ పోస్టర్ కూడా ఇటీవలే రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
యూరప్ లో సినిమా షూటింగ్ ప్రారంభమైంది.కానీ కరోన కేసులు ఎక్కువ కావడంతో సినిమా షూటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. చిత్ర యూనిట్ మొత్తం భారతదేశానికి తిరిగి వచ్చింది. తిరిగి షూటింగ్ ప్రారంభించింది చిత్ర యూనిట్. త్వరగా సినిమాను కంప్లీట్ చేసి..ఈ సంవత్సరమే విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ‘మహా నటి’ ఫేం నాగ్ అశ్విన్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ తో సినిమాల్లో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి -2 తర్వాత..వచ్చిన సాహో..అభిమానులను అంతగా అలరించకపోయింది.దీంతో రాధే శ్యామ్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భాగ్య శ్రీ, ప్రియదర్శి, ముర్లీ శర్మ, సచిన్ ఖేడేకర్, సాషా ఛెత్రి, కునాల్ రాయ్ కపూర్, సత్యాన్ లు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *