సీజనల్ వ్యాధులను దూరం చేసే కషాయం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దగ్గు, జలుబు వంటి సమస్యలు అన్ని సీజన్లలో వస్తుంటాయి. అయితే మార్కెట్లో అనేక మందులు, సిరప్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ అవి దుష్ర్పభావం చూపుతాయి. కావున కాలానుగుణంగా వచ్చే వ్యాధులను నయం చేయడానికి సహజ సిద్ధంగా లభించే పదార్థాలతో ఓ రెసిపీ ఉంది. దీనినే కషాయం అంటారు.దీని ద్వారా వెంటనే ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెంపొందిస్తోంది. జ్వరం, ఉబ్బసం, ఊపిరితిత్తుల రుగ్మతలు, గుండె జబ్బులు, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. ఇది అన్ని రకాల బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.రెసిపీనీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు
కావలసినవి
రెండు కప్పులు – నీరు
తగినన్ని తులసి ఆకులు
అర టీ స్పూన్ – నల్ల మిరియాలు పొడి
అర టీ స్పూన్ – శొంఠి పొడి
ఒక టీ స్పూన్ – తాటి బెల్లంతయారీ విధానం
ఒక పాత్ర లో నీరు పోసి, తులసి ఆకులను తుంచి వేయాలి.
నీటి రంగు కొద్దిగా మారిన తర్వాత, నల్ల మిరియాలు పొడి, శొంఠిపొడి, తాటి బెల్లం వేసి మరికొన్ని నిమిషాలు మరిగించాలి.ఎలా వాడాలి?
తులసి కషాయాన్ని వేడిగా తాగాలి. దీని ద్వారా దగ్గు, జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందొచ్చు. రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే తప్పనిసరిగా ఫలితం కనిపిస్తుంది.

Related Tags :

Related Posts :