Record applications to bag liquor shop licences across Telangana

రికార్డులు బ్రేక్ : లిక్కర్ అప్లికేషన్లపైనే 907కోట్లు ఆదాయం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీలో మద్యం నియంత్రణ ఎఫెక్ట్ తెలంగాణకు కలిసొచ్చింది. తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్‌ దరఖాస్తులతో ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో  సర్కార్ కు ఆదాయం వచ్చింది. 2017లో వచ్చిన రూ.411 కోట్ల ఆదాయాన్ని ఈసారి క్రాస్‌ చేసింది. ఏకంగా డబుల్ ఆదాయం వచ్చింది. రాష్ర్టంలో 2వేల 216 దుకాణాలు ఉండగా ‌‌‌‌‌‌‌మొత్తం 45వేల 385 దరఖాస్తులతో ‌‌‌‌‌‌ రూ.907.70 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. 

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం నియంత్రణకు జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో అక్కడున్న మద్యం వ్యాపారులు ఆంధ్రా సరిహద్దు జిల్లాల్లో ఎక్కువగా దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. గత పాలసీలో నాన్ రీఫండబుల్  దరఖాస్తు ఫీజు లక్ష ఉండగా, ఈ సారి ప్రభుత్వం రెండు లక్షలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఫీజు డబ్బులు మొత్తం ప్రభుత్వ ఖజానాలోకే వెళ్తాయి.  ఇక దరఖాస్తు చేసుకున్న వారిలో అనేక మంది కొత్తవారితోపాటు పెద్దసంఖ్యలో మహిళలు ఉండటం గమనార్హం. 18వ తేదీన డ్రా తీయనున్నారు. బుధవారం ఆఖరి గడువు కావడంతో పెద్ద సంఖ్యంలో దరఖాస్తులు వచ్చాయి. బుధవారం ఒక్క రోజే 24వేల448  అప్లికేషన్లు వచ్చాయని స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌ తెలిపారు.

వరంగల్ డివిజన్‌లో 261 దుకాణాలకు అత్యధికంగా 7వేల 864 అప్లికేషన్లతో రూ.157.28 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక హైదరాబాద్ డివిజన్‌లో 173 దుకాణాలకు 1,462 దరఖాస్తులే వచ్చాయి. ఇక్కడ రూ.29.24 కోట్లు మాత్రమే వచ్చింది. ఇక జిల్లాల వారీగా చూస్తే ఖమ్మంలో 4వేల282 అప్లికేషన్లకు రూ.85.64 కోట్లు, నల్లగొండలో 3వేల31 దరఖాస్తులకు 60.62 కోట్లు, కొత్త గూడెంలో 2వేల989 దరఖాస్తులకు 59.78 కోట్లు, సూర్యాపేటలో 2వేల384 దరఖాస్తులకు 47.68 కోట్ల ఆదాయం వచ్చింది.

Related Posts