లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

గ్రేటర్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

Published

on

Record Sale of Liquor Crossing Thousand Crore : గ్రేటర్ ఎన్నికల్లో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. పది రోజుల్లో వెయ్యి కోట్లకు పైగా లిక్కర్ అమ్ముడు పోయింది. ఎన్నికల షెడ్యూలు విడుదలైన రోజు నుంచే అమ్మకాల గ్రాఫ్.. రోజు రోజుకు అమాంతం పెరిగిపోయింది. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా మద్యం విక్రయాల జోరుగా కొనసాగే చాన్స్ ఉంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఆబ్కారీ శాఖకు కాసుల పంట పండించాయి. బల్దియా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక వారం రోజుల్లోనే వెయ్యి కోట్లకుపైగా మద్యం అమ్ముడుపోయింది. రాజకీయ పార్టీల ప్రచారాలు ఊపందుకున్నాక మద్యానికి గిరాకీ విపరీతంగా పెరిగింది.ఒక్కరోజు మినహా నిత్యం వంద కోట్లకు తగ్గకుండా సేల్స్‌ జరిగినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. గడిచిన వారం రోజుల్లో మద్యం అమ్మకాలు జరిగిన తీరు పరిశీలిస్తే ఇంత మందు తాగేశారా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. నవంబర్ 23న రూ.135 కోట్లు, 24న రూ.107 కోట్లు, 25న 102 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. నవంబర్ 26న మాత్రం కాస్త తగ్గాయి. ఆరోజున కేవలం రూ.58 కోట్లు మాత్రమే ఆదాయం లభించింది. మరుసటి రోజు నుంచి మళ్లీ మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. ఈనెల 27న రూ.170 కోట్లు, 28న రూ. 176 కోట్లు, 29న రూ. 108 కోట్ల మద్యం విక్రయాలు పెరిగినట్టుగా ఎక్సైజ్ శాఖ తెలిపింది.ఎన్నికలు రావడంతో సాధారణ రోజుల్లో కంటే 40శాతం అధికంగా మద్యం అమ్ముడైనట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు విడుదల చేసింది. గతేడాది నవంబర్‌లో 2 వేల 239 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోతే… ఈసారి 2 వేల 567 కోట్లకు పెరిగింది. గతేడాదితో పోల్చితే దాదాపు 500 కోట్ల విలువైన మద్యం అధికంగా అమ్ముడుపోయింది. నవంబరు 17 నుంచి 29 వరకు హైదరాబాద్‌లో 154 కోట్ల విలువైన లిక్కర్ సేల్స్‌ జరిగింది.రంగారెడ్డి జిల్లాలో 317 కోట్లు, మేడ్చల్ జిల్లాలో 42 కోట్లు, మెదక్ జిల్లాలో 100 కోట్ల లెక్కన… జీహెచ్ఎంసీ పరిధిలో 615 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గ్రేటర్‌ ఫలితాల తర్వాత కూడా రెండ్రోజుల పాటు మద్యం విక్రయాలు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. షెడ్యూల్ విడుదలకు… ఎన్నికలకు మధ్య తక్కువ టైమ్‌ ఉంటేనే వెయ్యి కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే.. మరికొంత కాలం గడువుండి ఉంటే.. ఇంకెంత మద్యం సేల్స్ అయివుండేదోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *