లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Technology

ఇండియాలో ‘రెడ్‌మి 9 పవర్’ న్యూ వేరియంట్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

Updated On - 10:18 am, Tue, 23 February 21

Redmi 9 Power Variant Launched in India : భారత మార్కెట్లోకి రెడ్‌మి కొత్త వేరియంట్ వచ్చేసింది. షియోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి కంపెనీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఆకర్షణీమైన ఫీచర్లతో లాంచ్ చేసింది. అదే.. రెడ్ మి9 పవర్. ఈ కొత్త వేరియంట్ 6GB ర్యామ్, 128GB స్టోరేజీతో రిలీజ్ అయింది. గత ఏడాదిలో 4GB RAM ఆప్షన్లతో మార్కెట్లోకి ప్రవేశపెట్టిన రెడ్ మి… అదనంగా 2GB ర్యామ్ జత చేసి మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఒక ర్యామ్ మినహా ఇతర ఫీచర్లను మాత్రం సేమ్ టు సేమ్ అలానే ఉంచేసింది. ఏ మార్పు చేయలేదు.

రెడ్‌మి 9 పవర్ 6GB ర్యామ్+128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ. 12,999 మాత్రమేనట.. బ్లేజింగ్ బ్లూ, ఎలక్ట్రిక్ గ్రీన్, ఫియెరీ రెడ్, మైటీ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. ఈ కామర్స్ వెబ్ సైట్లలో అమెజాన్, ఎంఐ డాట్ కామ్, ఎంఐ హోమ్స్, ఎంఐ స్టూడియోలలో ఈ కొత్త వేరియంట్ కొనుగోలు చేసుకోవచ్చు. ఇదివరకే మార్కెట్లోకి వచ్చిన రెడ్ మి 4GB ర్యామ్+64GB వేరియంట్ ధర రూ. 10,999లకే లభ్యమవుతోంది.

రెడ్‌మి 9 పవర్ ఫీచర్లు :

* డ్యూయల్ సిమ్ (నానో)

* ఆండ్రాయిడ్ 10 OS, 6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే

* అండర్ ది హుడ్, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 662 చిప్‌సెట్,

* 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు నాలుగు కెమెరాలు,

* సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా

* SD కార్డు 512GBకి మెమొరీ

* సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్,

* 6,000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *