నడుస్తున్న లారీలోంచి రూ.80 లక్షల విలువైన సెల్ ఫోన్లు చోరీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

చిత్తూరు జిల్లాలో సినీ ఫక్కిలో రూ.12 కోట్ల విలువైన సెల్ ఫోన్ల లారీని దొంగల ముఠా దోచుకెళ్లిన ఘటన మరువక ముందే నెలరోజుల వ్యవధిలో మరో ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. గుంటూరు-కలకత్తా జాతీయ రహదారిపై వెళుతున్న లారీ లోంచి రూ. 80 లక్షలవిలువైన రెడ్ మీ నోట్ సెల్ ఫోన్లను దుండగులు అపహరించారు.

తిరుపతి శ్రీ సిటీ నుంచి కలకత్తాకు సెల్ ఫోన్ల లోడ్ తో లారీ బయలు దేరింది. అందులో సుమారు 9 కోట్ల విలువైన సెల్ ఫోన్లు ఉన్నాయి. లారీ కాజ టోల్ గేట్ వద్దకువచ్చిన సమయంలో కంటైనర్ వెనుక డోర్ తీసి ఉండటాన్ని గమనించిన మరోక లారీ డ్రైవర్ సెల్ ఫోన్ల లారీ డ్రైవర్ ను అప్రమత్తం చేశాడు.లారీలో దొంగతనం జరిగిందని గమనించిన డ్రైవర్ వెంటనే సమీపంలోని మంగళగిరి పోలీసు స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేశాడు. కేసునమోదు చేసుకున్న పోలీసుల విచారణ చేస్తున్నారు.ఇదిలాఉండగా. తమిళనాడులోని శ్రీపెరంబూర్‌ నుంచి ముంబైకి వెళ్తున్న మొబైల్‌ ఫోన్ల లారీ గత ఆగస్టు 26న దొంగతనం జరిగిన సంగతి తెలిసిందే. కంటైనర్‌ ఆంధ్రా బోర్డర్‌ నగరి వద్దకు రాగానే లారీని అడ్డం పెట్టిన దుండగులు.. డ్రైవర్‌ను కొట్టి అందులోని 6 కోట్ల రూపాయల విలువైన మొబైల్‌ ఫోన్లను ఎత్తు కెళ్లారు.

Related Posts