లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

పసిడి కొనుగోలుదారులకు శుభవార్త : తగ్గిన బంగారం ధర

Published

on

Reduced gold price, Soak for buyers : బంగారం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. పసిడి ధర పడిపోయింది. బంగారం ధర మళ్లీ దిగొచ్చింది. పసిడి ధర నేలచూపులు చూస్తోంది. వెలవెలబోతోంది. బంగారం కొనుగోలుదారులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు.

హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.410 పడిపోయింది. రూ.45,900కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.440 తగ్గింది. రూ.50,070కు పడిపోయింది.

బంగారం ధర పడిపోతే.. వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. వెండి రూ.600 పైకి కదిలింది. దీంతో వెండి ధర రూ.69,600కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.33 శాతం తగ్గుదలతో 1844 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.77 శాతం తగ్గుదలతో 25.09 డాలర్లకు తగ్గింది.

కాగా బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *